Asianet News TeluguAsianet News Telugu

జగన్ 'సాక్షి'పై లోకేష్ పరువు నష్టం దావా!

సాక్షి దిన పత్రికపై టీడీపీ నాయకుడు లోకేష్ పరువు నష్టం దావా వేశారు. తనపై అసత్య ప్రచారాలు చేసింనందుకుగాను లోకేష్ విశాఖ‌ 12వ అద‌న‌పు జిల్లా జ‌డ్జి కోర్టు ను ఆశ్రయించారు. రూ75 కోట్ల పరువు నష్టం దావా వేయడంతో ఒరిజిన‌ల్ సూట్ 6/2020 నెంబ‌రుతో వాజ్యం దాఖ‌లైంది. ప్రస్తుతం ఈ వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Lokesh files Rs 96 crore defamation suit against witness
Author
Hyderabad, First Published Jan 25, 2020, 12:50 PM IST

ప్రముఖ సాక్షి దిన పత్రికపై టీడీపీ నాయకుడు లోకేష్ పరువు నష్టం దావా వేశారు. తనపై అసత్య ప్రచారాలు చేసింనందుకుగాను లోకేష్ విశాఖ‌ 12వ అద‌న‌పు జిల్లా జ‌డ్జి కోర్టు ను ఆశ్రయించారు. రూ75 కోట్ల పరువు నష్టం దావా వేయడంతో ఒరిజిన‌ల్ సూట్ 6/2020 నెంబ‌రుతో వాజ్యం దాఖ‌లైంది. ప్రస్తుతం ఈ వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళితే..  2019 అక్టోబ‌ర్ 22న సాక్షి పత్రికలో ‘చినబాబు చిరుతిండి 25 ల‌క్షలండి’ శీర్షికతో కథనం ప్రచురితమైంది.  అయితే ఆ క‌థ‌నంలో ప్ర‌చురితమైన అంశాల‌న్నీ పూర్తిగా అవాస్త‌వాలేన‌ని, దురుద్దేశపూర్వకంగా రాసిన త‌ప్పుడు క‌థ‌నం అని ఖండిస్తూ 2019  అక్టోబ‌ర్ 25న సాక్షి సంపాద‌క‌బృందానికి నారా లోకేశ్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు రిజిస్ట‌ర్ నోటీసు పంపించారు. దీనికి సంబంధించి 2019 న‌వంబ‌ర్ 10న సాక్షి నుంచి తిరుగుస‌మాధానం వ‌చ్చింది. దీనిపై సంతృప్తి చెంద‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా వేశారు. 

విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్ట్‌లో తాను చిరుతిళ్లు తిన్నాన‌ని సాక్షి రాసిన తేదీల‌లో తాను ఇత‌ర ప్రాంతాల‌లో ఉన్నాన‌ని అయినప్ప‌టికీ త‌న ప‌రువుకు భంగం క‌లిగించేందుకు, రాజకీయంగా ల‌బ్ధి పొందేందుకు అస‌త్యాలతో క‌థ‌నం వేశార‌ని దావాలో పేర్కొన్నారు. ఉన్న‌త విద్యావంతుడిగా, ఒక జాతీయ పార్టీకి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ప‌నిచేసిన త‌న ప‌రువు ప్ర‌తిష్ట‌లు మంట‌క‌లిపేందుకు త‌నకు సంబంధంలేని అంశాల‌తో ముడిపెట్టి అస‌త్య‌క‌థ‌నం రాసి ప్ర‌చురించిన కార‌ణంగా తీవ్ర‌మ‌నోవేద‌న‌కు గుర‌య్యాన‌ని అందులో పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన సాక్షి సంస్థ జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ లిమిటెడ్‌, సాక్షి ప్ర‌చుర‌ణ‌క‌ర్త మ‌రియు సంపాద‌కుడైన వ‌ర్థెల్లి ముర‌ళి, విశాఖ‌ప‌ట్నంకి చెందిన సాక్షి న్యూస్ రిపోర్ట‌ర్లు బి వెంక‌ట‌రెడ్డి, గ‌రిక‌పాటి ఉమాకాంత్‌లపై రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా దాఖ‌లు చేశారు.

----

మండలిలో అసలు జరిగింది ఇదీ... వీడియో విడుదల చేసిన లోకేష్

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఓ వైపు వైసీపీ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేయాలని అనుకుంటోంది. మరోవైపు శాసన మండలిలో వైసీపీ నేతలు దారుణంగా ప్రవర్తించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా... అసలు బుధవారం మండలిలో ఇది జరిగింది అంటూ లోకేష్ ఓ వీడియో విడుదల చేశారు.

శాసనమండలిలో ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు చర్చ సందర్భంగా ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో శాసనమండలిలో ఏం జరిగిందనేదానిది నారా లోకేశ్ ఈ లేఖలో పేర్కొన్నారు.
 
‘‘ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం. దేవాలయం లాంటి శాసనమండలిలో ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చలా వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వం తీరు, గుండాల్లా దాడి చేసిన మంత్రుల వ్యవహారశైలిని ప్రపంచం ముందుకు తెచ్చేందుకు ఒక బాధ్యత కలిగిన శాసనమండలి సభ్యుడిగా ఈ బహిరంగ లేఖ విడుదల చేస్తున్నా. ఏపీ శాసనసభ, శాసనమండలిలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు మీరు చూసే ఉంటారు. 2014 రాష్ట్ర విభజనను ఎంత అప్రజాస్వామికంగా, నిరంకుశంగా పార్లమెంట్ తలుపులు మూసి, లైవ్ టెలికాస్ట్ ఆపి వేసి, ఏపీ ఎంపీలపై దాడి చేసి మూకబలంతో బిల్లు తెచ్చారో. అదే విధమైన దారుణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చోటు చేసుకున్నాయి.


ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలకు పాలకపక్షం పాల్పడటం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. మండలిలో సభ్యులు కానీ మంత్రులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలపై దాడులకు దిగారు. మండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపేశారు. ఇంటర్‌నెట్ సేవలు ఆపేశారు. కరెంట్ కట్ చేశారు. ఇటువంటి సమయంలో గౌరవ అధ్యక్ష స్థానంలో ఉన్న షరీఫ్ వైపు ఒక్కసారిగా వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు దూసుకొచ్చారు. ఛైర్‌ని చుట్టుముట్టారు. ఛైర్మన్‌ను అంతు చూస్తామని బెదిరించారు. ఇతర టీడీపీ సభ్యులపైనా మూకుమ్మడిగా దాడి చేశారు. మండలి సభ్యుడిగా ఫోన్‌లో ఎటువంటి వీడియోలు చిత్రీకరించకూడదు.
 
కానీ వైసీపీ మంత్రులు తమ పంతం నెగ్గించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తా అంటూ హెచ్చరిస్తుండటంతో ఛైర్మన్, ఇతర ఎమ్మెల్సీల భద్రత కోసం తప్పని సరై వీడియో తీశాను. విలువలు, విశ్వసనీయత అంటూ లెక్చర్లు దంచే సీఎం జగన్, వైసీపీ మంత్రులు మండలిలో ఎలా ప్రవర్శించారో ప్రజల ముందుంచే ప్రయత్నమే ఇది.’’ అని లోకేశ్ రెండు పేజీల లేఖతో పాటు వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios