అన్నిటికన్నా పిచ్చ కామిడీ ఏంటంటే, జగన్ ప్లీనరీ సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ టిడిపి 2014 లోనే అమలు చేసినవట. అంటే, పోయిన ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ టిడిపి అమలు చేసేసిందని చెప్పటమేనా లోకేష్ ఉద్దేశ్యం .

చంద్రబాబునాయుడు పుత్రరత్నం, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్ మంత్రి నారా లోకేష్ భలే కామిడీ చేస్తున్నారు. ప్లీనరీలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పీచ్ పై స్పందిస్తూ, రాష్ట్రాభివృద్ధి చూసి జగన్ అసూయ పడుతున్నారట. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్ళు అయినా ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారట. ఎలా నిరూపిస్తారు? ప్రతీ కేసు విచారణ జరగకుండా స్టే తెచ్చుకుంటుంటే?

ఇక, తనపై వైసీపీ చేసిన అవినీతి ఆరోపణలపై ఇప్పటికి మూడు సార్లు తాను సవాల్ విసిరినా సమాధానం లేదట. జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించమని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు? అర్ధం లేని ఆరోపణలతో పుస్తకాలు వేస్తే జనాలు నమ్మరట. మరి, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు వైఎస్ఆర్ పై వేసిన పుస్తకాన్ని నమ్మలేదని అక్కసా? ఎందుకంటే, 2004-09 మధ్య వైఎస్ పై టిడిపి అవినీతి ఆరోపణలతో ఓ పుస్తకం అచ్చేసి పంచింది. అయితే, 2009 ఎన్నికల్లో జనాలు కాంగ్రెస్ నే మళ్ళీ గెలిపించిన సంగతి గుర్తుందా?

అన్నిటికన్నా పిచ్చ కామిడీ ఏంటంటే, జగన్ ప్లీనరీ సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ టిడిపి 2014 లోనే అమలు చేసినవట. అంటే, పోయిన ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ టిడిపి అమలు చేసేసిందని చెప్పటమేనా లోకేష్ ఉద్దేశ్యం. ఇక, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ప్లీనరీకి పరిచయం చేయటాన్ని కూడా లోకేష్ తప్పుపట్టారు. తన సామర్ధ్యంపై జగన్ కు నమ్మకం లేకే ప్రశాంత్ ను పరిచయటం చేసారట. 2014లో ప్రశాంత్ సేవలను నరేంద్రమోడి కూడా ఉపయోగించుకున్నారు. అంటే అప్పట్లో మోడికి కూడా తన సామర్ధ్యంపై నమ్మకం లేదా?

ఇక, చంద్రబాబును తిట్టడానికే ప్లీనరీ పెట్టారట.. ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా సమావేశాలు పెట్టుకున్నపుడు అధికారంలో ఉన్న పార్టీపైనే ఆరోపణలు చేస్తుంది. అందులో తప్పేముంది? మొన్నవిశాఖపట్నంలో టిడిపి మహానాడు నిర్వహించుకున్నది. అబ్బా, కొడుకులు, ఇతర నేతలంతా కలిసి జగన్ను ఎన్నిసార్లు తిట్టలేదు ? హామీలనేవి రాజకీయ లబ్దికోసమే ఇస్తారు ఎవరైనా. అందులో వింతేముంది? జగన్ అయినా అంతే చంద్రబాబు చేసిందీ అదే కదా?