Asianet News TeluguAsianet News Telugu

కపట ప్రేమ వద్దు షాజీ, గుణపాఠం చెప్తాం: షాపై లోకేష్ ట్వీట్ల దాడి

మరోవైపు రాయలసీమపై కపట ప్రేమ వద్దు షా జీ అని హితవు పలికారు. త‌రాలుగా క‌ల‌గా మిగిలిన జ‌లాలు వ‌చ్చాయి. పొలాలు త‌డిచాయి. కియా వ‌చ్చింది. ఉద్యోగాలు తెచ్చింది. ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి. ఉపాధిని పెంచాయి. రాయ‌లేలిన సీమ‌..కోన‌సీమ‌గా క‌నిపిస్తోందని కవిత్వంతో అదరగొట్టారు లోకేష్. 

lokesh counter attack on amit shah by twitter
Author
Amaravathi, First Published Feb 4, 2019, 6:36 PM IST

అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. శ్రీకాకుళం జిల్లాలో అమిత్ షా పర్యటన సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు ఆంధ్రప్ర‌దేశ్‌లో పర్యటించే ముందు రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.1,16,000 కోట్లను ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ప్రత్యేక హోదా, విశాఖ‌ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ పై స్పష్టత ఇచ్చిన తరువాత రాష్ట్రంలో అడుగు పెట్టాలని చెప్పుకొచ్చారు. తిత్లీ తుఫానుతో అల్లాడిపోయిన శ్రీకాకుళం జిల్లా వైపు చూడటానికి కూడా మనసు ఒప్పని బీజేపీ నేతలు ఇప్పుడు సిగ్గు లేకుండా శ్రీకాకుళం జిల్లా వేదికగా కుట్ర రాజకీయం మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. 

ఏ మొహం పెట్టుకొని శ్రీకాకుళం జిల్లా లో బీజేపీ నేతలు పర్యటిస్తారని ప్రశ్నించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న‌ది అభివృద్ధి కాదా అవినీతి అమిత్ షా అంటూ మండిపడ్డారు. ఏ1తో స్నేహం చేస్తే అంతా ఏ1 లాగే క‌నిపించ‌డంలో త‌ప్పులేదు. అంతేగా అంటూ సెటైర్ వేశారు. 

అభివృద్ధిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ దే అగ్ర‌స్థానమని అందుకు కేంద్రం ఇచ్చిన అవార్డులే సాక్ష్యమన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గ్రామీణాభివృద్ధిలో ఏపీ నెంబర్ 1 అని మీరే అవార్డులు ఇచ్చారు గుర్తుకు తెచ్చుకోండన్నారు. 

అవినీతి త‌క్కువ‌గా ఉన్న రాష్ట్రాల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి 3వ స్థానంలో ఉందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ఇండియా స‌ర్వే వెల్లడించిందన్నారు. అమిత్ షా పొర‌ప‌డ్డారా? వారి పార్టీనేత‌లే త‌ప్పుదారి ప‌ట్టించారా? అని సందేహం వ్యక్తం చేశారు. 

కేంద్రం కుదరదు అన్నా కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని మీ డిక్లరేషన్ రాజకీయాలకు ప్రజలే సమాధానం చెప్పబోతున్నారని లోకేష్ తెలిపారు. వెయిట్ అండ్ సి షా జీ అంటూ ట్వీట్ చేశారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగం అనే విషయం మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. 

ఇతర రాష్ట్రాలతో పాటు రాష్ట్ర హక్కుగా వచ్చిన నిధులు కాకుండా ఏపీకి ఏమి ఇచ్చారో మీరు చెప్పగలరా? అటూ నిలదీశారు. విభజన చట్టంలో కీలకమైన 14 అంశాల్లో 10 అంశాలను పూర్తి చేశామని అమిత్ షా అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

9 అంశాలను పూర్తిగా విస్మరించిన కేంద్రం, 5 అంశాలను సగానికి వదిలి పెట్టిన విషయంపై రాష్ట్రప్రజలందరూ చర్చించుకుంటూనే ఉన్నారన్నారు. పోలవరానికే ఇంకా రూ.3,722 కోట్లు ఇవ్వాల్సిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు.  

ప‌ద‌కొండు విద్యా సంస్థల ఏర్పాటుకు రూ.11,600 కోట్ల విలువైన 2,909 ఎకరాల భూమి ఇచ్చామని అలాగే రూ.131కోట్లతో ప్రహరీ గోడలు నిర్మించామని అందులో మీ మోడీ గారు ఇచ్చింది ఎంతో తెలుసా షా గారు? రూ. 746 కోట్లు అంటూ ఘాటుగా ప్రశ్నించారు. 

అంటే ప్రభుత్వం ఖర్చుపెట్టిన నిధులలో కేంద్రం ఇచ్చిన నిధులు 6 శాతం మాత్ర‌మేనని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రం వెచ్చించిన నిధులు, భూములు విలువ‌తో క‌లిపితే 94 శాతం ఇచ్చిందన్నారు. ఇందులో ఎవరు ఎక్కువ నిధులు ఇచ్చారో స్పష్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. 

వెనుక బడిన జిల్లాలకు ఇచ్చిన‌ట్టే ఇచ్చి మీరు వెనక్కి లాక్కున్న రూ. 350 కోట్ల‌కు మ‌రో రూ. 350 కోట్లు కలిపి ఇవ్వాల‌ని నీతి అయోగ్ సిఫార‌సు చేసిందని కానీ కేంద్రం రూపాయి కూడా ఇవ్వ‌లేదని మండిపడ్డారు. 

వెన‌క‌బ‌డిన జిల్లా అయిన శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన అమిత్ షా నీతి అయోగ్ ఇవ్వమన్న రూ.700 కోట్లు గురించి స‌మాధానం ఇవ్వాల్సిన బాధ్య‌త మీకు లేదా అని నిలదీశారు. బీజేపీ నేతలు ఆంధ్రప్ర‌దేశ్‌లో పర్యటించే ముందు రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.1,16,000 కోట్లను ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ప్రత్యేక హోదా, విశాఖ‌ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ పై స్పష్టత ఇచ్చిన తరువాత రాష్ట్రంలో అడుగు పెట్టాలని లేదంటే అమిత్‌షా త‌న స‌భ‌కు హాజ‌రైన ఖాళీ కుర్చీల‌తో చెప్పిన గాలిక‌బుర్లే చెప్పుకోవాల్సి వ‌స్తుందన్నారు. అందుకు సంబంధించి జనాలు లేక వెలవెలబోయిన కుర్చీలను లోకేష్ పోస్ట్ చేశారు. 

 

మరోవైపు రాయలసీమపై కపట ప్రేమ వద్దు షా జీ అని హితవు పలికారు. త‌రాలుగా క‌ల‌గా మిగిలిన జ‌లాలు వ‌చ్చాయి. పొలాలు త‌డిచాయి. కియా వ‌చ్చింది. ఉద్యోగాలు తెచ్చింది. ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి. ఉపాధిని పెంచాయి. రాయ‌లేలిన సీమ‌..కోన‌సీమ‌గా క‌నిపిస్తోందని కవిత్వంతో అదరగొట్టారు లోకేష్. 

కేంద్రం కుదరదు అన్నా కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని తేల్చి చెప్పారు. బీజేపీ డిక్లరేషన్ రాజకీయాలకు ప్రజలే సమాధానం చెప్పబోతున్నారు వెయిట్ అండ్ సి షా జీ అంటూ లోకేష్ ట్వీట్ల దాడి చేశారు. 


 

ఈ వార్తలు కూడా చదవండి

తేల్చుకుందామా...!దమ్ముంటే చర్చకు రండి : అమిత్ షా కు టీడీపీ కౌంటర్

సీఎం పదవి కోసం మోదీ కాళ్లు పట్టుకుని ఇప్పుడు నిందలా: చంద్రబాబుపై అమిత్ షా ఫైర్

బీజేపీ బస్సుయాత్రలో రభస: టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్

Follow Us:
Download App:
  • android
  • ios