బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బస్సు యాత్రను ప్రారంభించే కార్యక్రమానికి హాజరయ్యారు. పలాసకు అమిత్ షా చేరుకున్న సందర్భంగా పలాసలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర శివాజీ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషల నేతృత్వంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.  

శ్రీకాకుళం: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసనకు దిగింది.

బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బస్సు యాత్రను ప్రారంభించే కార్యక్రమానికి హాజరయ్యారు. పలాసకు అమిత్ షా చేరుకున్న సందర్భంగా పలాసలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర శివాజీ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషల నేతృత్వంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. 

అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర శివాజీ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషలను పోలీసులు అరెస్ట్ చేశారు.