మాజీమంత్రి అనిల్ కూ తప్పని రుణయాప్ ల వేధింపులు.. ఫోన్లోనే వాగ్వాదం..

లోన్ యాప్ నిర్వాహకులు ఓ అడుగు ముందుకువేసి ప్రజాప్రతినిధులనూ వేధించడం మొదలుపెట్టారు. మీ బంధువులు లోన్ తీసుకున్నారు అది మీరే చెల్లించాలంటూ బెదిరిస్తున్నారు. 

loan app harassments for former minister Anil kumar yadav  in nellore

నెల్లూరు : రుణ యాప్ నిర్వాహకులు రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఒకవైపు వేధింపులు భరించలేక కొందరు ఆత్మహత్య చేసుకుంటుంటే.. మరోవైపు సొమ్ము వసూలు కోసం ఎవరినీ వదిలిపెట్టడం లేదు వీరు. సామాన్యుడినే లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ వ్యవహారం చివరకు ప్రజాప్రతినిధుల వరకూ చేరింది. వారికీ వేధింపులు తప్పడంలేదు. ఫలానా వారు రుణం తీసుకున్నారు అని చెబుతున్న వ్యక్తులు..  దాన్ని మీరే చెల్లించాలని ఫోన్లు కూడా చేస్తున్నారు. వారు ఎవరో తెలియదని చెబితే మాటల దాడికి పాల్పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఓ మంత్రి, మాజీ మంత్రికి ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం చర్చనీయాంశంగా మారింది.  

గురువారం వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. ఆ మరుసటి రోజే మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు సైతం ఫోన్ చేసి లోన్ చెల్లించాలని వాగ్వాదానికి దిగిన విషయం బహిర్గతమైంది. మీ బావమరిది ఎనిమిది లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. మీరే చెల్లించాలంటూ వాగ్వాదానికి దిగాడు అగంతకుడు. అనిల్ కుమార్ ఎంత చెప్పినా వినక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు సంఘటనలతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు.

అనకాపల్లి: బీచ్‌లో విద్యార్థుల గల్లంతుపై జగన్ దిగ్భ్రాంతి.. మంత్రి అమర్‌నాథ్‌కు కీలక ఆదేశాలు

నలుగురు అరెస్ట్…
పాతపాటి అశోక్ కుమార్ అనే వ్యక్తి రూ. 8 లక్షల రుణం తీసుకున్నారంటూ రికవరీ ఏజెంట్లు ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేస్తున్న విషయం వెలుగు చూసింది.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 79 సార్లు ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టారు. ప్రముఖులకు ఈ వేధింపులతో చేదు అనుభవం ఎదురవుతుండడంతో పోలీసులు అప్రమత్తమై రంగంలోకి దిగి, కూపీ లాగారు. నిందితులను కటకటాల పాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విజయరావు మాట్లాడుతూ జిల్లాలో మంత్రి, మాజీ మంత్రికి ఫోన్లు చేసిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి  లాప్ టాప్, సెల్ఫోన్లు సీజ్ చేశామని అన్నారు. 

అనకాపల్లి : పూడిమడక బీచ్‌లో ఐదుగురు బీటెక్ విద్యార్ధులు గల్లంతు

చెన్నైకు చెందిన కోల్ మ్యాన్స్ సర్వీసెస్ రికవరీ ఏజెన్సీ నుంచి ర్యాండమ్ గా ఫోన్లు వస్తున్నాయి  అని, అందులో భాగంగానే ఈ నెంబర్లకు ఫోన్ చేసి వేధిస్తున్నారని తెలిపారు. తీసుకున్న వారికి ఫోన్ చేయకుండా… ఇతర నెంబర్లకు చేసి బెదిరించడం చట్టరీత్యా నేరమని అన్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అన్నారు. ఈజీగా రుణాలు ఇస్తున్నారు కదా అని.. లోన్ యాప్ ద్వారా రుణాలు తీసుకోవద్దని.. కష్టాలు పడొద్దని రాష్ట్ర ప్రజలకు హితవు పలికారు. ఎవరికైనా ఈ తరహా ఫోన్లు వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios