అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ లో విద్యార్థులు గల్లంతైన ఘటన పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయ చర్యలు పర్యవేక్షించాలని మంత్రి అమర్ నాథ్‌ను ఆయన ఆదేశించారు.
అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ లో విద్యార్థులు గల్లంతైన ఘటన పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయ చర్యలు పర్యవేక్షించాలని మంత్రి అమర్ నాథ్‌ను ఆయన ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. కాగా, పూడిమడక బీచ్ లో గల్లంతైన విద్యార్థుల కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. గల్లంతైన వారిని జగదీశ్ (గోపాలపట్నం), జస్వంత్ (నర్సీపట్నం), గణేశ్ (మునగపాక), రామచందు (యలమంచిలి), సతీశ్ (గుంటూరు)లుగా గుర్తించారు. మరోవైపు ఈ ఘటన నుంచి క్షేమంగా బయటపడిన విద్యార్థులతో జిల్లా కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. అటు గల్లంతైన వారి కోసం పడవలతో గాలింపు చేపట్టాలని ఎస్పీ మత్స్యకారులను విజ్ఞప్తి చేశారు.
Add Asianetnews Telugu as a Preferred Source

