Asianet News TeluguAsianet News Telugu

Liquor Sales : వార్నీ.. నిన్న ఒక్క రోజే అంత తాగారా ? ఏపీలో రూ.147 కోట్ల లిక్కర్ సేల్..

Liquor Sales : డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. రెండు రాష్ట్రాల్లో మద్యం భారీగా అమ్ముడపోయింది. ఏపీలో మామూలు రోజు కంటే నిన్న ఒక్క రోజే డబుల్ లిక్కల్ సేల్ జరిగింది. 

Liquor Sales : Varney.. Did you drink that much yesterday? Liquor sale worth Rs. 147 crores in AP..ISR
Author
First Published Jan 1, 2024, 3:58 PM IST

31st celebrations : పాత సంవత్సరం వెళ్లిపోతోందనే బాధతో ఒకరు, కొత్త సంవత్సరం రాబోతోందని సంతోషంతో ఇంకొకరు, ఇంకో కారణంతో మరొకరు.. ఇలా ఎటు చూసిన నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారింది. మద్యం తాగడంలో ఎవరూ ‘తగ్గేదేలే’ అన్నారు. దీని వల్ల ఎప్పుడూ లేనంతగా, న్యూఇయర్ తెచ్చిన కిక్కుతో రెండు రాష్ట్రాల్లో ఆదివారం రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. 

భారత్ లో కోవిడ్ కలకలం.. ఒకే రోజు 850 కొత్త కేసులు నమోదు.. ఏడు నెలల్లో ఇదే అత్యధికం..

ఏపీలో ఆదివారం మధ్యాహ్నం నుంచే మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. న్యూ ఇయర్ కావడంతో మద్యం దుకాణాల దగ్గర భారీగా క్యూ కనిపించింది. దీంతో అనేక వైన్స్ ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.147 కోట్ల లిక్కర్ సేల్ జరిగింది. కాగా.. సాధారణ రోజుల్లో రూ.75 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి. అయితే డిసెంబర్ 31 సందర్భంగా లిక్కర్ సేల్ ఓ రేంజ్‌లో పెరిగింది.

కస్టమర్లను కర్రలతో కొట్టిన రెస్టారెంట్ సిబ్బంది.. రాజాసింగ్ ఆగ్రహం.. వీడియో వైరల్

తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఆదివారం హైదరాబాద్ తో పాటు మిగిలిన జిల్లాల్లోనూ మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. బీర్లు,  వైన్లు, విస్కీలు ఇలా ఒకటేమిటి అన్ని రకాల మద్యం హాట్ కేకుల్లో అమ్ముడుపోయింది. మధ్యాహ్నం నుంచే వైన్స్ షాపు వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. ఒక్క రోజులోనే వంద కోట్ల అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31వ తేదీ మద్యం అమ్మకాలకు సంబంధించిన లెక్కలు ఇంకా అందుబాటులో రాకపోయినప్పటికీ.. డిసెంబర్ 29, 30,  31 మూడు రోజుల్లో కలిపి మొత్తంగా రూ.658 కోట్ల లిక్కర్ సేల్ అయ్యింది.

న్యూ ఇయర్ రోజు జపాన్ లో భారీ భూకంపం.. సునామీ వచ్చే ఛాన్స్..

ఈ మూడు రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం,  6.31లక్షల  కేసుల బీర్లు అమ్ముడు పోయాయి. ఈ మద్యంతో పాటు మటన్, చికెన్, చేపలు అమ్మకాలు కూడా పెరిరిగాయి. మామూలు రోజుల్లో అయితే రోజూ మూడు లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగేది. అయితే డిసెంబర్ 31 ఒక్క రోజు 4.5 లక్షల కిలోల చికెన్  కొనుగోలు చేశారు. అలాగే కూల్ డ్రింక్స్ అమ్మకాలు కూడా భారీ స్థాయిలోనే జరిగాయి. దీంతో పాటు కేకులు అమ్మకాలు కూడా జోరుగానే సాగాయి. ఇలా మద్యం, మాంసం, కూల్ డ్రింక్స్, కేకులతో న్యూ ఇయర్ ను ప్రజలు సెలబ్రేట్ చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios