విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ లో స్టైరిన్ గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం సరిగా వ్యవహరించని కారణంగానే ఈ  పరిస్థితి దాపురించిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. అయితే ఈ విషయమై దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ నేపథ్యంలో  పరిశ్రమలో ప్రతి రోజూ కార్యక్రమాల నిర్వహణకు గాను ప్రభుత్వం పాసులు జారీ చేసింది.

also read:ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ నుండి రెండోసారి గ్యాస్ లీకేజీ: పరుగులు పెట్టిన స్థానికులు, మీడియా

పరిశ్రమలో కెమికల్ ద్వారా ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు గాను మెయింటైనెన్స్ చేసేందుకు పాసులు జారీ చేశారు. 45 మందికి మెయింటెనెన్స్ పాసులు జారీ చేశారని అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది.

పరిశ్రమలోని ట్యాంకుల్లో సుమారు 2 వేల మెట్రిక్ టన్నుల స్టైరెన్ నిల్వ ఉంది. ఈ స్టైరెన్ రసాయనాన్ని 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాలి. అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత దాటితే గ్యాస్ లీకయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఫ్యాక్టరీలోో న్యూట్రలైజ్ చేసే ప్రక్రియ కూడ ఉంది. అయితే న్యూట్రలైజ్ ఎందుకు చేయలేదోననే విషయమై కూడ అధికారులు విచారణ చేస్తున్నారు. గ్యాస్ లీకైన సమయంలో ఫ్యాక్టరీలో 15 మంది కార్మికులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. 

ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో స్టైరెన్ లీకై మంటలు చెలరేగినట్టుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో ఈ గ్యాస్ వేగంగా వ్యాప్తి చెందింది.  ఈ గ్యాస్ లీకు కావడంతో  ఫ్యాక్టరీకి సమీపంలోని ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామానికి చెందిన ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.