ప్ర‌భుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చేంత వ‌ర‌కు రైల్వే భూముల్లో పేద‌వారిని ఉండ‌నివ్వాల‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ కోరారు. ఈ మేరకు విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ కు ఆయ‌న శుక్రవారం లేఖ రాశారు. 

ప్ర‌భుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చేంత వ‌ర‌కు రైల్వే (railway) భూముల్లో పేద‌వారిని ఉండ‌నివ్వాల‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (nara lokesh) కోరారు. ఈ మేరకు విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ (vijayawada railway divisional menager) కు ఆయ‌న శుక్రవారం లేఖ రాశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి (guntur district thadepalli) మున్సిపాలిటీలోని 6, 14, 15, 16 వార్డుల పరిధిలో ఉన్న రైల్వే భూముల్లో సుమారుగా 650 కుటుంబాలు ఏన్నో ఏళ్ల నుంచి నివ‌సిస్తున్నాయ‌ని తెలిపారు. దాదాపు 40 సంవ‌త్స‌రాలుగా వీరు ఆ ప్రాంతంలోనే ఉంటున్నార‌ని, వారంద‌రూ నిరుపేద‌ల‌ని చెప్పారు. ఇక్క‌డి నివసిస్తున్న వారంద‌రూ ఎస్సీ (sc), ఎస్టీ (st), బీసీ (bc), మైనారిటీ (minority)వ‌ర్గాల‌కు చెందిన వారేన‌ని, వీరంద‌రూ పనికెళ్తే కానీ పూట గడవని ద‌య‌నీయ‌స్థితి ఉన్నార‌ని పేర్కొన్నారు. 

ఆ ప్రాంతాల నుంచి ఉన్న‌ట్టుండి వారిని వెళ్లిపోవాల‌ని రైల్వే అధికారులు నోటీసులు ఇవ్వ‌డం స‌రైంది కాద‌ని అన్నారు. జ‌న‌వ‌రి 22వ తేదీలోపు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాల‌ని పేర్కొన‌డంతో అందరూ తీవ్ర ఆందోళ‌న చెందుతున్నార‌ని లోకేష్ తెలిపారు. కోవిడ్ కారణంగా ప్ర‌స్తుతం పనులు లేక పూట గడవటమే ఇబ్బందిగా మారింద‌ని అన్నారు. ఇలాంటి స‌మ‌యంలో వారికి రైల్వే నోటీసులు ఇచ్చి నిలువ నీడ కూడా లేకుండా చేయ‌డం భావ్యం కాద‌ని పేర్కొన్నారు. వీరికి వీలైనంత త్వ‌ర‌గా ప్రభుత్వం స్థలం కేటాయించాల‌ని, ఆ ప్ర‌దేశాల్లో ఇళ్లు క‌ట్టించి ఇవ్వాల‌ని అన్ని రాజ‌కీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయ‌ని తెలిపారు. ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం వీరికి ఇళ్లు క‌ట్టించి ఇచ్చేంత వ‌ర‌కు మాన‌వ‌తా దృక్ప‌థంతో తాడేపల్లి రైల్వే స్థలంలోనే వారిని ఉండనివ్వాల‌ని లేఖ‌లో నారా లోకేష్ పేర్కొన్నారు. 

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం నారా లోకేష్ కరోనా సోక‌డంతో ఆయ‌న హోం క్వారంటైన్ (home qurantaine) లో ఉన్నారు. జ‌న‌వ‌రి 17వ తేదీన ఆయ‌న‌కు కోవిడ్ -19 (covid -19) నిర్ధార‌ణ కావ‌డంతో ఆయ‌న క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. అనంత‌రం ట్విట్టర్ వేధిక‌గా స్పందించారు. త‌న‌కు క‌రోనా (corona) సోకింద‌ని తెలిపారు. అయితే ల‌క్ష‌ణాలు లేవ‌ని చెప్పారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇలా క్వారంటైన లో ఉన్న స‌మ‌యంలోనూ ఆయ‌న విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ కు నేడు లేఖ రాశారు. ఇటీవ‌లి కాలంలోనే ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కూడా లేఖ రాశారు.రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని అందులో సూచించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయ‌ని తెలిపారు. మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌ళ కూడా రెండు వారాల పాటు స్కూళ్ల‌కు సెలువులు పొడిగించార‌ని అన్నారు. కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అలాంటి నిర్ణ‌యాన్నేఅమ‌లు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా కేసులను దృష్టిలో ఉంచుకొని ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని కోరారు.