రైతుల భూముల దురాక్రమణను ఆపకపోతే  తొందర్లోనే  పచ్చని చేలు కనుమరుగైపోవడం ఖాయం!

ఇక్కడ రెండు వీడియోలు ఉన్నాయి. వీటిని చూస్తే అంధ్రప్రదేశ్ లో ఏమి జరుగబోతున్నదో కళ్ల ముందు కదలాడుతుంది.

రెండూ కూడా దాదాపు 50-70 కిలోమీటర్ల వేగంతో వెడుతున్న వాహనం నుండి తీయబడ్డాయి.
ఈ రెండింటిలోనూ రెండురకాల భూములు చూపబడ్డాయి.
అందులో ఏదీ నా స్వంతం కాదు.
అయినప్పటికీ -
మొదటి వీడియోలో చూపబడిన భూమి నాకు ఆనందం కలిగించింది.
రెండో వీడియోలో చూపబడిన భూమి నాకు చాల విచారం కలిగించింది.

మొదటి వీడియో చూడండి. 


నాయుడుపేట నుండి శ్రీకాళహస్తికి వెళ్లే రహదారి ఇది.
రహదారి ప్రక్కనే కనులకు విందు చేస్తూ పచ్చని పొలాలు ఉన్నాయి.

రెండో వీడియో చూడండి.


కావలి నుండి నెల్లూరుకు వెళ్లే 5 వ సంఖ్య జాతీయరహదారి ఇది.
రహదారి ప్రక్కనే సుదీర్ఘమైన కాంపౌండ్ వాల్.
దాని వెనుక సువిశాలమైన సారవంతమైన భూమి ఉంది. 
ఒక పెద్ద చెరువు కూడా ఉంది.

ఇవన్నీ రైతుల స్వాధీనం నుండి పెట్టుబడిదారుల చేతులలోకి వెళ్లాయి. ఎందుకలా భూమి చేతులు మారింది? రైతులు ఇష్టపూర్వకంగా వారి భూమిని ధారాదత్తం చేశారా? రైతులు పండించేందుకు నీరు లేక ఇచ్చిన దాఖలాలు ఏమీ లేవు. ఆ కాంపౌండ్ వాల్ వెనుక ఉన్న చెరువులో ఎంత నీరు డిసెంబర్లో కూడా నిలువ ఉందో చూస్తే అటువంటి సందేహమే రాదు. రైతులు పని చేసేందుకు బద్దకించి భూములు అమ్మేశారనుకోలేము. అంతటి విశాలమైన భూమి ఒక్క రైతుకు చెంది ఉండదు. వందమంది రైతులలో ఏ ఒక్కడో సోమరిపోతు ఉండి ఉండవచ్చు. వాడి ప్రోద్బలంతో మిగిలిన రైతులందరూ మూకుమ్మడిగా భూములు అమ్మి ఉంటారని భావించలేము.

మరి ఏ శక్తి అంత భూమిని పెట్టుబడిదారుల చేతులలో పడేలా చేసింది? ఖచ్చితంగా దౌర్జన్యశక్తే దీనికి కారణం అని నాకు అనిపిస్తోంది.

ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో 100% తిండి తినే బ్రతుకుతున్నారు కదా? అందులో వారంలో ఏడు రోజులూ కేవలం మాంసాహారం మాత్రమే తిని బ్రతుకుతున్న వారి సంఖ్య 10% అయినా దాటుతుందా? ఆ లెక్కన మిగిలిన 90% జనాలు తినేది శాకాహారమే కదా? రైతులు తిన్నా తినకపోయినా వారు పండిస్తున్నదంతా మిగిలిన జనాలు తింటూనే ఉన్నారు కదా?

మరి రైతులను రైతువృత్తిని ఎందుకలా అణచివేస్తూ వ్యాపారస్థులను పెంచుతున్నారు? పాపం, రైతులు ఏ పాపం చేశారు? భవిష్యత్తులో భారతదేశపు ఆహారభద్రత విషయం ఏమిటి? అనుభవజ్ఞుడు పిల్లల్ని కనండహో అని చాటింపు వేశాడు. అలా రాజకీయ అనుభవజ్ఞుల ఉద్యోగహామీపై బలవంతంగా కనబడ్డ జనాల్ని చెరువులో చేపల్ని పట్టినట్టు భవిష్యత్తులో ఉద్యోగమనే వల పన్ని ఈ వ్యాపారస్థులు పట్టుకుని నంజుకుతినేస్తారు.

రైతులనుండి ఈ భూముల ఆక్రమణను ఆపకపోతే భారతజాతి భవిష్యత్తు సందేహాస్పదం. భారతజాతి మనుగడ మరో రెండు శతాబ్దాలలో పూర్తిగా కనుమరుగైపోవడం ఖాయం!

పనికిమాలిన పాలన! పనికిమాలిన విజన్లు! కలియుగపు ధర్మం నెరవేర్చడానికి పుట్టిన కలిపురుషుని అనుచరులు వీరు!