మంత్రి చెప్పిందంతా బాగానే ఉంది. మరి, చంద్రబాబునాయుడుంటున్న బ్లాకులోకి నీళ్ళు ఎలా వచ్చాయి? అసెబ్లీ ప్రహరిగోడ ఎలా కూలిపోయింది? అసెంబ్లీ, సచివాలయం గోడల ప్లాస్ట్రింగ్ వూడిపోవటానికి ఎవరు కారణమో చెబితే బాగుంటుంది.
అసెంబ్లీని హై క్వాలిటీతో నిర్మించారట. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ బుధవారం మాట్లాడుతూ, లీకేజీ వల్లే అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఛాంబర్ లీకైందట. అదికూడా ఎవరో కావాలనే అసెంబ్లీ పై అంతస్తులోని పైప్ లైన్ ను కట్ చేయటం వల్లే నీటి లీకేజి జరిగిందని చెప్పుకొచ్చారు. దాని వల్ల వర్షపు నీరు పైప్ లైన్ ద్వారా జగన్ ఛాంబర్ లోకి వచ్చినట్లు కూడా మంత్రి నిర్ధారించారు. అసెంబ్లీ నిర్మించిన తర్వాత కురిసిన వర్షాలకు ఎప్పుడూ లీకవ్వని నీళ్ళు ఇప్పుడు మాత్రమే ఎందుకు లీకైందంటూ నారాయణ ప్రశ్నించారు. చిన్న విషయానికే అనవసర రాద్దాంతం చేస్తున్నట్లు మండిపడ్డారు.
మంత్రి చెప్పిందంతా బాగానే ఉంది. మరి, చంద్రబాబునాయుడుంటున్న బ్లాకులోకి నీళ్ళు ఎలా వచ్చాయి? అసెబ్లీ ప్రహరిగోడ ఎలా కూలిపోయింది? అసెంబ్లీ, సచివాలయం గోడల ప్లాస్ట్రింగ్ వూడిపోవటానికి ఎవరు కారణమో చెబితే బాగుంటుంది. అంతెందుకు నిర్మాణంలో ఉండగానే కొన్ని చోట్ల కాలమ్ బీమ్ క్రుంగిపోవటం నిజంకాదా? స్పీకర్, మంత్రి మాటలు విన్న తర్వాత నిర్మాణాలు నిసిరకమని అంగీకరించటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదన్న విషయం అర్ధమైపోతోంది. ఒకవైపు సిఐడి విచారణ జరుగుతుండగానే ఇంకోవైపు మంత్రి అలా మాట్లాడటమేంటో అర్ధం కావటం లేదు. కాకపోతే ఎవరిని బాద్యులను చేస్తారో చూడాలి.
