చంద్రబాబుకు జాతీయ పార్టీల షాక్

చంద్రబాబుకు జాతీయ పార్టీల షాక్

రెండు రోజుల పర్యటనలో చంద్రబాబుకు జాతీయ పార్టీల నేతలు పలువురు షాక్ ఇచ్చారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రత్యేకహోదాకు మద్దతు కోరుతూ చంద్రబాబు సోమవారం రాత్రి నుండి ఢిల్లీలో మకాం వేసిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే, రెండు రోజుల పాటు ఢిల్లీలో క్యాంపు వేసినా జాతీయ పార్టీల్లోని ప్రముఖులెవరూ చంద్రబాబుతో చర్చల విషయంలో పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎన్సీపీ అధినేత శరత్ పవార్ తప్ప చెప్పుకోదగ్గ అధినేతలెవరూ చంద్రబాబుకు మద్దతుగా నిలవలేదు.

ప్రధానమంత్రి నరేంద్రమోడికి వ్యతిరేకంగా అందరినీ కలుద్దామని చంద్రబాబు అనుకున్నా సాధ్యం కాలేదు. ఎందుకంటే, చంద్రబాబు కలిసిన పార్టీల అధినేతల్లో అత్యధికులు మోడిని ప్రభావితం చేయగలిగే స్ధితిలే లేకపోవటమే.

అందుకే చంద్రబాబు చెప్పిందంతా విన్న పలువురు నేతలు ఏదో మొక్కుబడిగా తలూపారట. ఆ విషయం బుధవారం సాయంత్రం చంద్రబాబు మీడియా సమావేశంలో స్పష్టంగా కనబడింది. మీడియా సమావేశంలో చంద్రబాబు తప్ప మిగిలిన పార్టీల నేతలు పెద్దగా కనబడలేదు.

పైగా ఇతర పార్టీల నేతలతో చంద్రబాబుకు అపాయిట్మెంట్ ఇప్పించటం కోసం టిడిపి ఎంపిలు నానా అవస్తలు పడ్డారట. దాంతో జాతీయస్ధాయిలో చంద్రబాబు సత్తా ఏంటో అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos