Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి చేసుకుంటానని చెల్లికి మాయమాటలు చెప్పి దారుణం.. గుంటూరులో షాకింగ్ ఘటన

గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని ఓ ప్రబుద్ధుడు సొంత చెల్లికే మాయమాటలు చెప్పాడు. ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆ తర్వాత వంచించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బాధితురాలు ఆ తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 

lawyer assaults sister physically.. later victim commits suicide in andhra pradesh
Author
Amaravati, First Published May 21, 2022, 5:32 PM IST

అమరావతి: వరుసకు చెల్లి. బాధ్యతగా నిలబడి రేపో మాపో ఆమె పెళ్లి చేయాల్సిన అన్నయ్య.. తప్పుదారి పట్టాడు. చెల్లి అని చూడకుండా ఆమెకు మాయమాటలు చెప్పాడు. వలలో వేసుకున్నాడు. ఏకంగా పెళ్లి చేసుకుంటానని భ్రమలు కల్పించాడు. వరుసకు వారిద్దరూ అక్కచెల్లెళ్ల పిల్లలు. కానీ, ఆ లాయర్ ఆమెకు కల్లిబొల్లి కబుర్లు చెప్పి దారి తప్పించాడు. అన్నా చెల్లెల్లే అయినప్పటికీ వారిద్దరి మధ్య సంబంధం అక్రమం అయ్యే దాకా తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. చెల్లికి శారీరకంగా దగ్గరయ్యాడు. మోసం చేయడంతో ఆ అమాయక చెల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. 

గుంటూరు చిలకలూరి పేట, తూర్పు మాలపల్లికి చెందిన జంగా ప్రతాప్ లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. 2019 నుంచి గడ్డిపాడులోని చిన్నమ్మ ఇంటిలో ఉంటూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అక్కడే చెల్లి రమాదేవిపై కన్నేశాడు. రమాదేవి తల్లి దీనకుమారి, ప్రతాప్ తల్లి సొంత అక్కాచెల్లెళ్ల పిల్లలు.

అయితే, రమాదేవిని శారీరంగా వాడుకున్న జంగా ప్రతాప్ ఆ తర్వాత ఆమెను వదిలించుకోవాలని అనుకున్నాడు. తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో అమ్మాయితో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యా డు. పెళ్లి రోజు కూడా రమా దేవితో చాట్ చేశాడు. కానీ, మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2021 ఆగస్టులో జంగా ప్రతాప్ ఈ పెళ్లి చేసుకున్నాడు. 

పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన జంగా ప్రతాప్‌ను రమాదేవి నిలదీసింది. ఆ తర్వాత తీవ్ర మనస్థాపానికి గురై అదే సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

రమాదేవి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఫోన్ మెసేజీలు, కాల్స్ పరిశీలించారు. దీంతో వారి దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు జంగా ప్రతాప్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన రీతిలో విచారించగా నిజాలను ఒప్పుకున్నాడు. జంగా ప్రతాప్‌ను 14 రోజుల రిమాండ్‌లోకి తీసుకున్నట్టు పెదకాకాని సీఐ సురేష్ బాబు వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios