అనంతపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు మరియు పథకాల లబ్ది కోసం దరఖాస్తు చేయవలసిన గ్రామ సచివాలయ పోర్టల్‌ను ప్రారంభించారు.అనంతరం వివిధ అంశాలపై సీఎం కలెక్టర్లతో సమీక్షించారు.  

ముఖ్యంగా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు విషయంపై జరిగిన సమీక్షలో అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ...  హిందూపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన 51.20 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. గుర్తించిన భూమికి సంబంధించిన వివరాలతో కూడిన ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి పంపిస్తామని ముఖ్యమంత్రికి  వివరించారు.

read more   రీల్ లైఫ్ లోనే కాదు ఆయన రియల్ లైఫ్ హీరో: ముద్దుల మావయ్యకు లోకేష్ స్పెషల్ విషెస్

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్ ( రైతు భరోసా & రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రామ /వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, అసిస్టెంట్ కలెక్టర్ జి.సూర్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ 60వ వసంతంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. హీరోగా సినీ ప్రముఖులు, అభిమానుల నుండి హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయ ప్రముఖులు, ప్రజల నుండి శుభాకాంక్షలు అందుకుంటున్నారు. అలాగే కుటుంబసభ్యులు కూడా బాలయ్యకు ప్రత్యేకంగా పుట్టినరోజు విషెస్ తెలుపుతున్నారు. ఇలా ఆయన పుట్టినరోజునే హిందూపురంలో మెడికల్ కాలేజి ఏర్పాటుకు మరో ముందుడుగు పడటంపై స్థానిక ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.