గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో భూకబ్జాదారులు రెచ్చిపోయారు. ఏకంగా  వైసీపీ ఎమ్మెల్యే అంబటి పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. భాను ప్రసాద్ అనే వ్యక్తికి ఓ కబ్జాదారుడు ఫోన్ చేసి స్థలం దగ్గరకు వస్తే ముక్కలుగా నరుకుతానంటూ హెచ్చరించాడు.

తాను మంచిగా చెబుతున్నానని, వినకపోతే నీ ఇష్టంమని అతను వార్నింగ్ ఇచ్చాడు. రేపు అంబటి రాంబాబు కూడా వస్తున్నారని.. అక్కడే నీ అంతు తేలుస్తానంటూ అవతలి వైపు వ్యక్తి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

2017లో సర్వే నెంబర్ 174లో 11 సెంట్ల స్థలాన్ని బాధితుడు ప్రసాద్ కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం భూకబ్జా బాధితులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమకు జరిగిన అన్యాయాన్ని వెళ్లగక్కారు.

ఇదే సమయంలో మీడియాకు ఎక్కడంతో భూ కబ్జాదారులు చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా భాను ప్రసాద్‌కు బెదిరింపు కాల్ రావడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాడు.