తిరుపతి: తాను నిర్వహించిన తెలంగాణ శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వేపై ఆంధ్ర ఆక్టోపస్, విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మాట్లాడడానికి నిరాకరించారు.  ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆయన చేసిన సర్వేను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దానిపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. 

"వద్దు వద్దు.. మొన్న మాట్లాడటమే పొరపాటైంది. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు అనుకుంటూనే ఆ కార్నర్‌కి వెళ్లి మాట్లాడేశాను. ఎప్పుడూ మాట్లాడను... మొన్నేదో మీ అందరినీ చూసి మాట్లాడేశా" అని ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.