ఆడోళ్ళు ఎంత మొత్తుకున్న అటువైపు కూడా చూడలేదు. దాంతో నీటి ఎద్దడి ఒకవైపు పెరిగిపోతుండటం, ఇంకోవైపు ఎంఎల్ఏ కనీసం కన్నెత్తైనా చూడకపోవటం. దాంతో మహిళలకు ఒళ్లు మండిది.

హిందుపురంలో మంచినీళ్ళ కోసం మహిళలు రోడ్డెక్కారు. చాలాకాలంగా మంచినీళ్ల సమస్యను పరిష్కరించాలంటూ మహిళలు ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణను వేడుకుంటున్నారు. కానీ పాపం బాలయ్యకు అంత తీరికేది. సినిమా షూటింగ్ లతో బిజీకదా? ఆడోళ్ళు ఎంత మొత్తుకున్న అటువైపు కూడా చూడలేదు. దాంతో నీటి ఎద్దడి ఒకవైపు పెరిగిపోతుండటం, ఇంకోవైపు ఎంఎల్ఏ కనీసం కన్నెత్తైనా చూడకపోవటం. దాంతో మహిళలకు ఒళ్లు మండిది. అందుకనే ఈరోజు హిందుపురం పట్టణంలో మహిళలు భారీ ఎత్తున నిరసన తెలిపారు.

ఉదయం నుండి మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి మరీ నిరసన తెలిపారు. మరి నిరసన అంటే ప్రతిపక్షాలు ఎలాగూ ఉంటాయికదా? పనిలో పనిగా ప్రతిపక్షాలు కూడా మహిళలతో కలిసాయి. దాంతో పోలీసులకు మండింది. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దాంతో ఉద్రిక్తత తలెత్తింది. ఎంతచెప్పినా నిరసన కార్యక్రమం నుండి వెనక్కు పోవటానికి మహిళలు అంగీకరించకపోవటంతో పోలీసులు చివరకు లాఠీలకు పనిచెప్పారు. దాంతో మహిళలతో పాటు స్ధానికులు కూడా బాలకృష్ణ, ప్రభుత్వంపై మండిపడుతున్నారు.