Asianet News TeluguAsianet News Telugu

ఈ నెలలో పెళ్లి: వూహన్ లో చిక్కుకున్న కర్నూలు యువతి (వీడియో)

ఈ నెల 14వ తేదీన పెళ్లి కావాల్సిన ఎపీలోని కర్నూలు యువతి చైనాలోని వూహన్ లో చిక్కుకుపోయింది. కరోనావైరస్ సోకిందనే అనుమానంతో ఆమెను విమానంలోకి అనుమతించలేదు. దాంతో ఆమె ఓ వీడియో విడుదల చేసింది.

Kurnool Woman Stranded In China, To Marry This Month, Appeals For Help
Author
Kurnool, First Published Feb 3, 2020, 11:56 AM IST

బీజింగ్: చైనాలోని ఊహాన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన  కర్నూలు జిల్లా యువతి చిక్కుకుంది. తను కాపాడి స్వదేశానికి తీసుకు వెళ్లాలటూ వాట్సాప్ వీడియో తీసి తన వారికి పంపింది. తమ పాప కష్టాల్లో వుందన్న సమాచారంతో తల్లి, బంధువులు తల్లడిల్లి పోతున్నారు. ఎలాగైనా తమ పాపను కాపాడలంటూ వేడుకుంటున్నారు

 చైనాలో చిక్కుకొన్న యువతికి ఈ నెల 14వ తేదీన వివాహం జరగనుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ కంపెనీ శిక్షణ కోసం చైనాకు వెళ్లి అన్యం జ్యోతి వూహాన్ లో చిక్కుకుపోయింది. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం బిజినవేముల గ్రామానికి చెందిన అన్యం జ్యోతి చైనాలో చిక్కుకుపోయింది.

Also Read: కరోనా ఎఫెక్ట్: చైనా కనెక్టింగ్ ఫ్లైట్స్‌కు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నో పర్మిషన్

గత సంవత్సరం ఆగస్టులో తిరుపతిలోని టి సి ఎల్ సెల్ కంపెనీ తరఫున ఆమె శిక్షణ కోసం చైనాకు వెళ్ళింది. అయితే కరోనా వైరస్ తీవ్రం కావడంతో భారత దేశ పౌరులందరికీ ప్రత్యేక విమానంలో భారతదేశానికి తీసుకొని వచ్చిన సంగతి తెలిసిందే. 

జ్యోతికి మరో అమ్మాయికి జ్వరం ఎక్కువగా ఉందన్న కారణంతో వారిని విమానంలోకి అనుమతించలేదు. దాంతో ఆమె అక్కడే ఉండిపోయింది. దీంతో తీవ్రంగా ఆందోళన పడ్డ జ్యోతి తాను ఎదుర్కొంటున్న సమస్యలను వీడియో ద్వారా తన బంధువులకు తన వారికి తెలిపింది. 

ప్రస్తుతం ఇప్పుడు ఆ వీడియో కర్నూలు జిల్లా లోకల్ వాట్సప్ గ్రూపులలో వైరల్ అవుతోంది.  తాము ఇద్దరం మాత్రం ఇక్కడే మిగిలిపోయాయని తమను చోట ఉంచారని కనీసం తినడానికి తిండి మంచి మందులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ వీడియోలో తెలిపింది. 

Also Read: చైనాలో చిక్కుకొన్న తెలుగు టెక్కీ జ్యోతి: ఇండియా ఫ్లైట్ ఎక్కకుండా అడ్డుకొన్న అధికారులు

తమకు వైరస్ కి సంబంధించి ఎటువంటి లక్షణాలు లేవని కేవలం జ్వరం ఉంది అన్న ఒకే ఒక్క కారణంతో తమను ఇక్కడే విడిచి వెళ్లి పెట్టి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జ్యోతికి  మహానంది మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన యువకుడు తో నిశ్చితార్థం జరిగింది.ఫిబ్రవరి 14న వివాహ ముహూర్తం నిర్ణయించారు. 

దీంతో ఊహించని విధంగా శృతి చైనాలోని పూహాన్ ప్రాంతంలో చిక్కుకుపోవడంతో ఇప్పుడు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరో పది రోజుల్లో పెళ్లి బట్టలతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన తమ కుమార్తె అనుకోని కష్టాలతో దేశం కాని దేశంలో చిక్కులు ఎదుర్కొంటోందని ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ బిడ్డను కాపాడాలని వేడుకుంటున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios