హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో  చైనా కనెక్టింగ్ విమానాలను అధికారులు అనుమతించడం లేదు కరోనా వైరస్ భయంతో ఈ విమానాలకు అనుమతించడం లేదు. దేశంలో ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రెండు నమోదయ్యాయి.దీంతో అధికారులు కూడ ముందు జాగ్రత్తగా చైనా కనెక్టింగ్ విమానాలకు శంషాబాద్‌లో అనుమతిని ఇవ్వడం లేదు.

also read:చైనాను వణికిస్తున్న కరోనా వైరస్: ఆదివారం ఒక్క రోజే 57 మంది మృతి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడి చైనాలో సుమారు మూడు వందలకు పైగా మృతి చెందినట్టుగా వార్తలు వచ్చాయి. పిలీఫ్పీన్స్‌లో కూడ ఈ వ్యాధితో ఒకరు మరణించారు. ఇండియాలో త్రిపురలో ఒకరు మృతి చెందారు.దేశ వ్యాప్తంగా కొందరు అనుమానితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Also read:చైనాలో చిక్కుకొన్న తెలుగు టెక్కీ జ్యోతి: ఇండియా ఫ్లైట్ ఎక్కకుండా అడ్డుకొన్న అధికారులు

హాంకాంగ్, స్విట్జర్లాండ్ విమానాలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అనుమతి ఇవ్వడం లేదు. వారంలో  హాంకాంగ్‌కు ఐదు, స్విట్జర్లాండ్‌కు 10 విమానాలు హైద్రాబాద్ శంషాబాద్  విమానాశ్రయానికి వస్తాయి. అయితే కరోనా వైరస్ కారణంగా ఈ విమానాలకు అనుమతిని ఎయిర్‌పోర్ట్ అధికారులు నిరాకరించారు.

కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని  ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో భారత ప్రభుత్వం కూడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంది. ఈ క్రమంలోనే ఈ విమానాల రాకపోకలను అనుమతి ఇవ్వడం లేదని అధికారులు ప్రకటించారు.

చైనా కనెక్టింగ్ విమానాలను రద్దు చేయడం కారణంగా ప్రయాణీకులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అయితే కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ఇలా నిర్ణయం తీసుకొన్నట్టుగా చెబుతున్నారు.

చైనా నుండి వచ్చే విమానాలను ఢిల్లీకే పరిమితం చేయాలనే  ఆలోచనపై చర్చ సాగుతోంది.  కరోనా వ్యాధి తీవ్ర తగ్గిన తర్వాత  చైనా కనెక్టింగ్ విమానాలను శంషాబాద్ విమానాశ్రయానికి అనుమతించే అవకాశం ఉంటుందని సమాచారం.