మోడిని కలిసిన బుట్టా: చంద్రబాబుకు షాక్

Kurnool MP Butta renuka jolts chandrababu
Highlights

చంద్రబాబు కేంద్రప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

చంద్రబాబునాయుడుకు తాజాగా మరో ఫిరాయింపు ఎంపి బుట్టారేణుక కూడా షాక్ ఇచ్చినట్లేనా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న ప్రాచారాన్ని బట్టి చూస్తే అవుననే సమాదానం వస్తోంది. ఎందుకంటే, చంద్రబాబు కేంద్రప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో బుట్టా తన కుటుంబసభ్యులతో ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలిశారు. ఆ విషయం తెలియగానే చంద్రబాబు షాక్ తిన్నారు.

పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున కర్నూలులో ఎంపిగా గెలిచిన బుట్టా తర్వాత టిడిపిలోకి జంప్ చేశారు. విచిత్రమేమిటంటే, తన అనుచరులకు దగ్గరుండి చంద్రబాబుతో కండువా కప్పించారు కానీ ఆమె మాత్రం కండువా కప్పుకోలేదు. దానికితోడు బుట్టా  ఫిరాయించిన తర్వాత నుండి టిడిపి పరిస్ధితి కూడా ఏమంతా బావోలేదు. దాంతో బుట్టాలో గందరగోళం మొదలైంది.

అందుకనే కేంద్రానికి వ్యతిరేకంగా వైసిపి, టిడిపి చేస్తున్న పోరాటాలో ఎక్కడా ఎంపి కనబడటం లేదు. అసలు, ప్రత్యేకహోదా గురించే ఎంపి ఎక్కడా మాట్లాడటం లేదు. బుట్టా వైఖరి అంతుబట్టక టిడిపి ఎంపిలు అయోమయానికి గురవుతున్నారు. ఇంతలో తన కుటుంబసభ్యులతో ఎంపి ప్రధానిని కలిశారని తెలియగానే మండిపోతున్నారు.

ఈరోజు ఉదయం ఓ టిడి ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో తాను టిడిపి తరపున పోటీ చేస్తానని చెప్పలేదు. పైగా అప్పటి పరిస్దితులను బట్టి ఏ పార్టీ నుండి పోటీ చేయాలో నిర్ణయించుకుంటానని చెప్పటం విచిత్రంగా ఉంది.

అదే సమయంలో మోడిని సమర్ధిస్తూ మాట్లాడటం టిడిపికి మింగుడుపడటం లేదు. దాంతో చంద్రబాబుకు బుట్టా పెద్ద షాకే ఇచ్చినట్లైంది. ఎందుకంటే, ఇంతకు ముందే మరో ఫిరాయింపు ఎంపి కొత్తపల్లి గీత కూడా చంద్రాబాబుకు ఎదురుతిరిగిన విషయం తెలిసిందే.

loader