Kuppam municipal result: చంద్రబాబు కోటలో వైసీపీ జయకేతనం.. కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్న జగన్ పార్టీ..

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (chandrababu Naidu)  కోటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది. కుప్పం మున్సిపాలిటీని (Kuppam municipal result) వైసీపీ కైవసం చేసుకుంది.

Kuppam municipal results 2021 Big Shock to chandrababu ysrcp Wins kuppam municipality

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది. కుప్పం మున్సిపాలిటీని (Kuppam municipal result) వైసీపీ కైవసం చేసుకుంది. కుప్పం మున్సిపాలిటీగా ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో వైసీపీ జయకేతనం ఎగరవేసింది. కుప్పం మున్సిపాలిటిలో మొత్తం 25 స్థానాలు ఉండగా.. 14వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం కావడంతో.. మిగిలిన 24 స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే పోలింగ్ సందర్భంగా వైసీపీ, టీడీపీ మధ్య పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 

Also reda: AP Municipal Elections results 2021: దర్శి మున్సిపాలిటీని కైవసం చేసుకన్న టీడీపీ.. ఎన్ని వార్డుల్లో గెలిచిందంటే

కుప్పం మున్సిపాలిటీ (Kuppam municipal result) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఉండటంతో.. టీడీపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే చంద్రబాబు కంచుకోటలో జెండా ఎగరవేయాలని అధికార వైసీపీ భావించింది. ఈ నేపథ్యంలోనే అందరి దృష్టి కుప్పం మున్సిపాలిటీ ఫలితంపైనే ఉంది. అయితే కుప్పం మున్సిపాలిటిలో మొత్తం 25 స్థానాలు ఉండగా.. 14వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం కావడంతో.. మిగిలిన 24 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏకగ్రీవంతో కలిపి వైసీపీ 19 స్థానాలు సొంతం చేసుకుని కుప్పం మున్సిపల్ పీఠం దక్కించుకుంది. ఇక, టీడీపీ 6 వార్డుల్లో మాత్రమే గెలుపొందింది. ఇక, దర్శి మినహా మిగిలిన మున్సిపాలిటీల్లోనూ, నెల్లూరు కార్పొరేషన్‌ను కూడా వైసీపీ కైవసం చేసుకుంది.  కుప్పంలో వైసీపీ విజయంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Also read: AP Election Result 2021: మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ తెలుసుకోండి..

కుప్పంలో పాగా వేసేందుకు వైసీపీ గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న ఉంది. చంద్రబాబు కంచుకోటను బద్దలు కొట్టాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 2014 నుంచి చూస్తున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో గెలుపు కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో కుప్పం నుంచి మరోసారి విజయం సాధించినప్పటికీ.. వైసీపీ అభ్యర్థికి కూడా భారీగానే ఓట్లు పోలయ్యాయి. 2019లో భారీ మెజారిటీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత.. కుప్పంపై ఆ పార్టీ మరింతగా ఫోకస్ పెంచింది.

గత కొంతకాలంగా జరిగిన ప్రతి ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ హవా కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెండింగ్‌లో ఉన్న కుప్పం మున్సిపాటిటీ ఇటీవల ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అంతకు ముందు నుంచే కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ ముఖ్య నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. గత మూడు నెలలుగా కుప్పంలో విజయం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నారు. నోటఫికేషన్ వెలువడిన తర్వాత పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన నేతలు అంతా కుప్పంలో పర్యటించారు. పోల్ మెనేజ్‌మెంట్ కూడా చేశారు. 

టీడీపీకి ఓట్లు పడకుండా చేయడంలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుపై వ్యతిరేకత తీసుకురావడంలో సఫలం అయ్యారు. ఈ విధంగా కుప్పం మున్సిపాలిటీ‌పై వైసీపీ జెండా ఎగరవేశారు. 2019 తర్వాత ప్రతి ఎన్నికల్లో పరాజయం పొందతున్న టీడీపీ.. ఇప్పుడు కంచుకోటగా ఉన్న కుప్పంను కూడా కోల్పోయింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios