AP Election Result 2021 Highlights: చంద్రబాబు ఇలాకాలో వైసిపి పాగా... కుప్పం సహా అన్నీ అధికార పార్టీవే

AP Election Result 2021

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన పలు నగరపాలక,  మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ఇవాళ (బుధవారం) ఉదయమే ప్రారంభమయ్యింది. అయితే టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీ ఫలితం కూడా నేడే వెలువడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కుప్పంతో పాటు నెల్లూరు కార్పోరేషన్, బుచ్చిరెడ్డిపాలెం, కమలాపురం నగర పంచాయితీ, రాజంపేట మున్సిపాలిటీల ఫలితం నేడు వెలువడనుంది. 

1:02 PM IST

విశాఖలో రెండు డివిజన్లు వైసిపివే...

విశాఖలో 31, 61 వార్డులను అధికార వైసిపి  కైవసం చేసుకుంది. 31వ వార్డులో 28 ఓట్లతో వైసిపి అభ్యర్థి గెలుపొందాడు. దీంతో ఇక్కడ రీకౌంటింగ్ జరపాలని టిడిపి కోరుతోంది. 

12:17 PM IST

నెల్లూరు కార్పోరేషన్లో క్లీన్ స్వీప్ దిశగా వైసిపి

నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్లో అధికార వైసిపి క్లీన్ స్వీప్ దిశగా వెళుతోంది. మొత్తం 54 డివిజన్లకు గాను ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఇక తాజాగా 20డివిజన్లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించగా, మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.  

12:17 PM IST

కాకినాడలో వైసిపి క్లీన్ స్వీప్

కాకినాడ కార్పోరేషన్ లో వైసిపి క్లీన్ స్వీప్ చేసింది. నాలుగు డివిజన్లలో ఉపఎన్నిక జరగ్గా అన్నింటా వైసిపి విజయం సాధించింది. 3,9, 16,30 డివిజన్లలో వైసిపి విజయం సాధించింది.

12:17 PM IST

దర్శి మినహా అన్ని మున్సిపాలిటీలు వైసిపివే...రెండు చోట్ల హోరాహోరీ

ఎన్నికలు జరిగిన  12 మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాల్లో వైసిపి విజయం సాధించింది. 9 మున్సిపాలిటీలను వైసిపి, ఒక్క దర్శిని మాత్రమే టిడిపి దక్కించుకుంది. ఇక జగ్గయ్యపేట, కొండపల్లిలో టిడిపి, వైసిపిల మధ్య హోరాహోరీ సాగుతోంది. 

12:17 PM IST

మంత్రి బుగ్గనకు షాక్...

బేతంచెర్లలో మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ నివాసముండే వార్డులో 88ఓట్లతో టిడిపి అభ్యర్థి విజయం సాధించాడు. 
 
12:17 PM IST

ఒక్కఓటుతో వైసిపి అభ్యర్థి విజయం... రెండు సార్లు రీకౌంటింగ్ చేసినా అదే పలితం

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం 8వ వార్డు ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కేవలం ఒక్క ఓటు తేడాతో వైసిపి అభ్యర్థి విజయం సాధించాడు. ఇప్పటికే రెండుసార్లు రికౌంటింగ్ చేసినా అదే ఫలితం వచ్చింది. అధికారులు తనను మోసం చేస్తున్నారని టిడిపి అభ్యర్థి నిరసనకు దిగాడు.

11:51 AM IST

అకివీడులో రీకౌంటింగ్ కు వైసిపి పట్టు

పశ్చిమ గోదావరి జిల్లా అకివీడులోని 10వార్డులో జనసేన పార్టీ అభ్యర్ధి కేవలం 9ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. దీంతో వైసిపి రీకౌంటింగ్ కు పట్టుబడుతోంది. 
 
11:51 AM IST

జగ్గయ్యపేట కౌటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట కౌటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక వైసిపి ఎమ్మెల్యే ఉదయభాను కౌటింగ్ కేంద్రంలోకి వెళ్లడంతో టిడిపి శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే గలాటి సృష్టించేందుకే వచ్చారంటూ కలెక్టర్, ఎస్పీకి టిడిపి ఫిర్యాదు చేసింది. 

11:51 AM IST

నెల్లూరులోనూ వైసిపిదే హవా

నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ లోనూ వైసిపి హవా కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం 54 డివిజన్లు కాగా ఇప్పటికే వైసిపి 9 చోట్ల విజయం సాధించింది.

11:51 AM IST

కొండపల్లిలో వైసిపి, టిడిపి హోరాహోరీ

కృష్ణా జిల్లా కొండపల్లిలో వైసిపి, టిడిపి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.  మొత్తం 29వార్డులకు గాను ఇప్పటివరకు వైసిపి 8, టిడిపి 7 చోట్ల విజయం సాధించాయి. మరోచోట ఇండిపెండెంట్ గెలిచారు.

11:22 AM IST

ఆకివీడు కూడా వైసిపిదే...

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో వైసిపి విజయం సాధించింది. మొత్తం 20 వార్డులకుగాను వైసిపికి అత్యధికంగా 12చోట్ల గెలుపొందింది. ఇక టిడిపి 4, జనసేన 3 వార్డుల్లో విజయం సాధించాయి. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలుపొందాడు. 

11:22 AM IST

పెనుగొండలో వైసిపి విజయకేతనం... ఖాతా తెరవని టిడిపి

అనంతపురం జిల్లా పెనుగొండలో అధికార వైసిపి ఘన విజయం సాధించింది. ఇక్కడ టిడిపి కనీసం ఖాతాకూడా తెరవలేదు. 20వార్డులకు గాను 18వార్డులను వైసిపి కైవసం చేసుకుంది.
 
11:22 AM IST

గురజాలలో వైసిపి విజయకేతనం

గుంటూరు జిల్లా గురజాలలో వైసిపి 16, టిడిపి 3, జనసేన 1చోట విజయం సాధించారు.
 
11:18 AM IST

బిగ్ బ్రేకింగ్... చంద్రబాబుకు షాక్... కుప్పంలో వైసిపిదే గెలుపు

మాజీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సొంతనియోజకవర్గం కుప్పంలోనూ తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పలేదు.  మొత్తం 25 వార్డులకు గాను వైసిపి 14వార్డులను కైవసం చేసుకుంది.  టిడిపి కేవలం 2చోట్ల మాత్రమే విజయం సాధించింది.

11:01 AM IST

దర్శి నగరపంచాయితీ టిడిపిదే...

ప్రకాశం జిల్లా దర్శి నగరపంచాయితీని టిడిపి కైవసం చేసుకుంది. 20 వార్డులకు గాను టిడిపి 13 వార్డుల్లో విజయం సాధించింది. ఇక వైసిపి మిగిలిన 7 వార్డులను దక్కించుకుంది. 

11:01 AM IST

బేతంచర్ల మున్సిపాలిటీ వైసిపి కైవసం

కర్నూల్ జిల్లా బేతంచర్ల మున్సిపాలిటీలో వైసిపి విజయం సాధించింది. 20వార్డులకు గాను 12 వార్డుల్లో వైసిపి, టిడిపి 4వార్డులను కైవసం చేసుకుంది. 
 
10:52 AM IST

దర్శిలో టిడిపి హవా

ప్రకాశం జిల్లా దర్శిలో 20 వార్డులకు గాను 14,15,17,18,19 వార్డుల్లో టిడిపి విజయం సాధించింది. 

10:52 AM IST

కుప్పంలో అధిక వార్డుల్లో టిడిపి ఆధిక్యం...

కుప్పంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 3,10, 11,12,15 వార్డుల్లో టిడిపి ముందంజలో వుంది. ఇక 1,2, 7 వార్డుల్లో వైసిపి ముందంజలో వుంది. మిగిలిన వార్డుల్లో వైసిపి, టిడిపి మధ్య హోరాహోరీ ఫైట్ సాగుతోంది. 
 
10:52 AM IST

కమలాపురం వైసిపి వశం

కమలాపురం మున్సిపాలిటీని వైసిపి కైవసం చేసుకుంది. 20 వార్డులకు గాను వైసిపి 15, టిడిపి 5 వార్డుల్లో విజయం సాధించింది. 

10:38 AM IST

జగ్గయ్యపేటలో హోరాహోరీ

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వైసిపి 2, టిడిపి 2 వార్డుల్లో విజయం సాధించాయి. 

10:38 AM IST

దర్శిలో వైసిపి 2, టిడిపి 1 వార్డులో విజయం

ప్రకాశం జిల్లా దర్శిలో 20 వార్డులకు గాను మూడు వార్డుల్లో ఫలితం వెలువడింది. ఇందులో వైసిపి 2, టిడిపి 2 వార్డులో గెలుపొందింది. 

10:38 AM IST

టిడిపికి ఆరు ఓట్ల మెజారిటీ... రీకౌంటిగ్ చేపట్టిన అధికారులు

కడప జిల్లా కమలాపురం 1,19 వార్డుల ఫలితంపై ఉత్కంఠ... ఆరు ఓట్ల మెజారిటీతో గెలిచిన టిడిపి అభ్యర్థులు... ఈ రెండు వార్డుల్లోనూ రీకౌంటింగ్ 

10:38 AM IST

ఆకివీడులో వైసిపి, జనసేన హోరాహోరీ..

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో మొత్తం 20 వార్డులకు గా వైసిపి 2,జనసేన 2 గెలుచుకున్నాయి. 
 
10:19 AM IST

దాచేపల్లిలో హోరాహోరీ...

దాచేపల్లిలోని 20 వార్డుల్లో ఇప్పటివరకు 17వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో వైసిపి 9,టిడిపి 7,జనసేన ఒకచోట విజయం సాధించాయి. మరో మూడు వార్డుల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. 

10:19 AM IST

రాజంపేట కౌంటింగ్ కేంద్రం వద్ద గందరగోళం

కడప జిల్లా రాజంపేట మునిసిపాలిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. కొందరు టిడిపి ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రంలోకి పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులతో ఏపీ టిడిపి ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల్రాయుడు వాగ్వాదానికి దిగారు.
 
10:19 AM IST

బేతంచెర్లలో 18,19 వార్డులు వైసిపి కైవసం

కర్నూల్ జిల్లా బేతంచెర్ల 18,19 వార్డుల్లో వైసిపి అభ్యర్థులు గెలుపొందారు.  
 
10:11 AM IST

కుప్పంలో హోరాహోరీ... రెండు వార్డుల్లో వైసిపి ముందంజ

కుప్పం మున్సిపాలిటీలో 1, 2 వార్డుల్లో వైసిపి ముందంజలో వుంది. మిగిలిన వార్డుల్లో టిడిపి-వైసిపి హోరాహోరీగా పోరాడుతున్నాయి. 
 
10:11 AM IST

కొండపల్లి 1వ వార్డులో నిలిచిన కౌంటింగ్

కృష్ణా జిల్లా కొండపల్లి 1వ వార్డులో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. బ్యాలెట్ బాక్స్ కు సీల్ లేదంటూ ఓ స్వతంత్ర అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేసాడు. దీంతో కౌంటింగ్ నిలిపివేసిన అధికారులు బ్యాలెట్ బాక్సులను పరిశీలిస్తున్నారు. 

10:06 AM IST

దాచేపల్లిలో టిడిపి హవా... జనసేన, వైసిపికి చెరో రెండు

దాచేపల్లిలో తొమ్మిది వార్డుల్లో టిడిపి అభ్యర్థుల విజయం సాధించారు. రెండు వార్డుల్లో జనసేన, రెండు వార్డుల్లో వైసిపి అభ్యర్థులు గెలుపొందారు. 

9:55 AM IST

గురజాలలోనూ రెండు వార్డులు వైసిపి వశం

గుంటూరు జిల్లా గురజాల 1వ వార్డులో వైసిపి అభ్యర్థి లింగాచారి, 2వ వార్డులో హుస్సేన్ బి విజయం సాధించారు. 
 
9:55 AM IST

కమలాపురం కైవసం దిశగా వైసిపి

కడప జిల్లా కమలాపురంలో అధికార వైసిపి విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఏడు వార్డుల ఫలితం వెలువడగా ఏడింట్లోనూ వైసిపి అభ్యర్థులే విజయకేతనం ఎగరేసారు. 
 
9:55 AM IST

గుంటూరు కార్పోరేషన్లోనూ టిడిపిదే విజయం

గుంటూరు కార్పోరేషన్  6వ డివిజన్లో టిడిపి విజయం సాధించింది. 400 ఓట్లకు పైగా ఆధిక్యంతో టిడిపి అభ్యర్థి సమత గెలుపొందారు.

9:35 AM IST

దాచేపల్లిలో జనసేన భోణీ... 8వ వార్డులో విజయం

గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయితీ జనసేన పార్టీ భోణీ కొట్టింది. 6, 7 వార్డుల్లో టిడిపి అభ్యర్థుల విజయం సాధించగా 8వ వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు.
 
9:35 AM IST

కొవ్వూరులో టిడిపి బోణీ...

పశ్చిమ గోదావరి కొవ్వూరు 23వ వార్డులో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 727ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి రమాదేవి విజయం సాధించారు.

9:35 AM IST

కమలాపురం 14 వార్డులో వైసిపి విజయం

కమలాపురం 14 వార్డులో వైసిపి  అభ్యర్థి మేరీ గెలుపొందారు.

9:35 AM IST

రాజంపేట 18వ వార్డులో వైసిపి విజయం

రాజంపేట 18వ వార్డులో వైసిపి అభ్యర్థి బిల్లా దివ్యతేజ గెలుపొందారు.
 
9:27 AM IST

కమలాపురం 3వ వార్డులో వైసిపి విజయం

కమలాపురం మున్సిపాలిటీ 3వ వార్డులో వైసిపి విజయం సాధించింది. 

9:27 AM IST

కమలాపురం 15వార్డులో వైసిపి విజయం

కమలాపురంలోని 15వ వార్డులో వైసిపి అభ్యర్థి సంద్యారాణి విజయం సాధించారు. 

9:24 AM IST

వైసిపి అభ్యర్థుల విజయం

కడప జిల్లాలోని రాజంపేటలోని 1 వ వార్డులో వైసిపి అభ్యర్థి షేక్ సుమియా గెలుపొందారు. ఇక 2వ వార్డులో వైసిపి అభ్యర్థి దాసరి మౌనిక విజయం సాధించారు.  

8:42 AM IST

కుప్పంలో నో పోస్టల్ బ్యాలెట్స్...

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ నేరుగా బ్యాలెట్ బాక్సుల నుండే ప్రారంభమయ్యాయి.  ఈ మున్సిపాలిటీ పరిధిలో మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదవగా ఇందులో ఒక్కటి కూడా ఓటెయ్యలేదు. దీంతో బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. 

1:02 PM IST:

విశాఖలో 31, 61 వార్డులను అధికార వైసిపి  కైవసం చేసుకుంది. 31వ వార్డులో 28 ఓట్లతో వైసిపి అభ్యర్థి గెలుపొందాడు. దీంతో ఇక్కడ రీకౌంటింగ్ జరపాలని టిడిపి కోరుతోంది. 

1:20 PM IST:

నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్లో అధికార వైసిపి క్లీన్ స్వీప్ దిశగా వెళుతోంది. మొత్తం 54 డివిజన్లకు గాను ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఇక తాజాగా 20డివిజన్లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించగా, మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.  

12:34 PM IST:

కాకినాడ కార్పోరేషన్ లో వైసిపి క్లీన్ స్వీప్ చేసింది. నాలుగు డివిజన్లలో ఉపఎన్నిక జరగ్గా అన్నింటా వైసిపి విజయం సాధించింది. 3,9, 16,30 డివిజన్లలో వైసిపి విజయం సాధించింది.

12:30 PM IST:

ఎన్నికలు జరిగిన  12 మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాల్లో వైసిపి విజయం సాధించింది. 9 మున్సిపాలిటీలను వైసిపి, ఒక్క దర్శిని మాత్రమే టిడిపి దక్కించుకుంది. ఇక జగ్గయ్యపేట, కొండపల్లిలో టిడిపి, వైసిపిల మధ్య హోరాహోరీ సాగుతోంది. 

12:23 PM IST:

బేతంచెర్లలో మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ నివాసముండే వార్డులో 88ఓట్లతో టిడిపి అభ్యర్థి విజయం సాధించాడు. 
 
12:17 PM IST:

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం 8వ వార్డు ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కేవలం ఒక్క ఓటు తేడాతో వైసిపి అభ్యర్థి విజయం సాధించాడు. ఇప్పటికే రెండుసార్లు రికౌంటింగ్ చేసినా అదే ఫలితం వచ్చింది. అధికారులు తనను మోసం చేస్తున్నారని టిడిపి అభ్యర్థి నిరసనకు దిగాడు.

12:08 PM IST:

పశ్చిమ గోదావరి జిల్లా అకివీడులోని 10వార్డులో జనసేన పార్టీ అభ్యర్ధి కేవలం 9ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. దీంతో వైసిపి రీకౌంటింగ్ కు పట్టుబడుతోంది. 
 
12:03 PM IST:

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట కౌటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక వైసిపి ఎమ్మెల్యే ఉదయభాను కౌటింగ్ కేంద్రంలోకి వెళ్లడంతో టిడిపి శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే గలాటి సృష్టించేందుకే వచ్చారంటూ కలెక్టర్, ఎస్పీకి టిడిపి ఫిర్యాదు చేసింది. 

11:53 AM IST:

నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ లోనూ వైసిపి హవా కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం 54 డివిజన్లు కాగా ఇప్పటికే వైసిపి 9 చోట్ల విజయం సాధించింది.

11:51 AM IST:

కృష్ణా జిల్లా కొండపల్లిలో వైసిపి, టిడిపి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.  మొత్తం 29వార్డులకు గాను ఇప్పటివరకు వైసిపి 8, టిడిపి 7 చోట్ల విజయం సాధించాయి. మరోచోట ఇండిపెండెంట్ గెలిచారు.

11:33 AM IST:

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో వైసిపి విజయం సాధించింది. మొత్తం 20 వార్డులకుగాను వైసిపికి అత్యధికంగా 12చోట్ల గెలుపొందింది. ఇక టిడిపి 4, జనసేన 3 వార్డుల్లో విజయం సాధించాయి. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలుపొందాడు. 

11:30 AM IST:

అనంతపురం జిల్లా పెనుగొండలో అధికార వైసిపి ఘన విజయం సాధించింది. ఇక్కడ టిడిపి కనీసం ఖాతాకూడా తెరవలేదు. 20వార్డులకు గాను 18వార్డులను వైసిపి కైవసం చేసుకుంది.
 
11:22 AM IST:

గుంటూరు జిల్లా గురజాలలో వైసిపి 16, టిడిపి 3, జనసేన 1చోట విజయం సాధించారు.
 
11:18 AM IST:

మాజీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సొంతనియోజకవర్గం కుప్పంలోనూ తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పలేదు.  మొత్తం 25 వార్డులకు గాను వైసిపి 14వార్డులను కైవసం చేసుకుంది.  టిడిపి కేవలం 2చోట్ల మాత్రమే విజయం సాధించింది.

11:04 AM IST:

ప్రకాశం జిల్లా దర్శి నగరపంచాయితీని టిడిపి కైవసం చేసుకుంది. 20 వార్డులకు గాను టిడిపి 13 వార్డుల్లో విజయం సాధించింది. ఇక వైసిపి మిగిలిన 7 వార్డులను దక్కించుకుంది. 

11:01 AM IST:

కర్నూల్ జిల్లా బేతంచర్ల మున్సిపాలిటీలో వైసిపి విజయం సాధించింది. 20వార్డులకు గాను 12 వార్డుల్లో వైసిపి, టిడిపి 4వార్డులను కైవసం చేసుకుంది. 
 
10:58 AM IST:

ప్రకాశం జిల్లా దర్శిలో 20 వార్డులకు గాను 14,15,17,18,19 వార్డుల్లో టిడిపి విజయం సాధించింది. 

10:56 AM IST:

కుప్పంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 3,10, 11,12,15 వార్డుల్లో టిడిపి ముందంజలో వుంది. ఇక 1,2, 7 వార్డుల్లో వైసిపి ముందంజలో వుంది. మిగిలిన వార్డుల్లో వైసిపి, టిడిపి మధ్య హోరాహోరీ ఫైట్ సాగుతోంది. 
 
10:52 AM IST:

కమలాపురం మున్సిపాలిటీని వైసిపి కైవసం చేసుకుంది. 20 వార్డులకు గాను వైసిపి 15, టిడిపి 5 వార్డుల్లో విజయం సాధించింది. 

10:47 AM IST:

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వైసిపి 2, టిడిపి 2 వార్డుల్లో విజయం సాధించాయి. 

10:45 AM IST:

ప్రకాశం జిల్లా దర్శిలో 20 వార్డులకు గాను మూడు వార్డుల్లో ఫలితం వెలువడింది. ఇందులో వైసిపి 2, టిడిపి 2 వార్డులో గెలుపొందింది. 

10:42 AM IST:

కడప జిల్లా కమలాపురం 1,19 వార్డుల ఫలితంపై ఉత్కంఠ... ఆరు ఓట్ల మెజారిటీతో గెలిచిన టిడిపి అభ్యర్థులు... ఈ రెండు వార్డుల్లోనూ రీకౌంటింగ్ 

10:38 AM IST:

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో మొత్తం 20 వార్డులకు గా వైసిపి 2,జనసేన 2 గెలుచుకున్నాయి. 
 
10:35 AM IST:

దాచేపల్లిలోని 20 వార్డుల్లో ఇప్పటివరకు 17వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో వైసిపి 9,టిడిపి 7,జనసేన ఒకచోట విజయం సాధించాయి. మరో మూడు వార్డుల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. 

10:26 AM IST:

కడప జిల్లా రాజంపేట మునిసిపాలిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. కొందరు టిడిపి ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రంలోకి పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులతో ఏపీ టిడిపి ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల్రాయుడు వాగ్వాదానికి దిగారు.
 
10:19 AM IST:

కర్నూల్ జిల్లా బేతంచెర్ల 18,19 వార్డుల్లో వైసిపి అభ్యర్థులు గెలుపొందారు.  
 
10:14 AM IST:

కుప్పం మున్సిపాలిటీలో 1, 2 వార్డుల్లో వైసిపి ముందంజలో వుంది. మిగిలిన వార్డుల్లో టిడిపి-వైసిపి హోరాహోరీగా పోరాడుతున్నాయి. 
 
10:11 AM IST:

కృష్ణా జిల్లా కొండపల్లి 1వ వార్డులో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. బ్యాలెట్ బాక్స్ కు సీల్ లేదంటూ ఓ స్వతంత్ర అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేసాడు. దీంతో కౌంటింగ్ నిలిపివేసిన అధికారులు బ్యాలెట్ బాక్సులను పరిశీలిస్తున్నారు. 

10:06 AM IST:

దాచేపల్లిలో తొమ్మిది వార్డుల్లో టిడిపి అభ్యర్థుల విజయం సాధించారు. రెండు వార్డుల్లో జనసేన, రెండు వార్డుల్లో వైసిపి అభ్యర్థులు గెలుపొందారు. 

10:00 AM IST:

గుంటూరు జిల్లా గురజాల 1వ వార్డులో వైసిపి అభ్యర్థి లింగాచారి, 2వ వార్డులో హుస్సేన్ బి విజయం సాధించారు. 
 
9:57 AM IST:

కడప జిల్లా కమలాపురంలో అధికార వైసిపి విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఏడు వార్డుల ఫలితం వెలువడగా ఏడింట్లోనూ వైసిపి అభ్యర్థులే విజయకేతనం ఎగరేసారు. 
 
9:55 AM IST:

గుంటూరు కార్పోరేషన్  6వ డివిజన్లో టిడిపి విజయం సాధించింది. 400 ఓట్లకు పైగా ఆధిక్యంతో టిడిపి అభ్యర్థి సమత గెలుపొందారు.

9:50 AM IST:

గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయితీ జనసేన పార్టీ భోణీ కొట్టింది. 6, 7 వార్డుల్లో టిడిపి అభ్యర్థుల విజయం సాధించగా 8వ వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు.
 
9:42 AM IST:

పశ్చిమ గోదావరి కొవ్వూరు 23వ వార్డులో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 727ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి రమాదేవి విజయం సాధించారు.

9:38 AM IST:

కమలాపురం 14 వార్డులో వైసిపి  అభ్యర్థి మేరీ గెలుపొందారు.

9:35 AM IST:

రాజంపేట 18వ వార్డులో వైసిపి అభ్యర్థి బిల్లా దివ్యతేజ గెలుపొందారు.
 
9:29 AM IST:

కమలాపురం మున్సిపాలిటీ 3వ వార్డులో వైసిపి విజయం సాధించింది. 

9:27 AM IST:

కమలాపురంలోని 15వ వార్డులో వైసిపి అభ్యర్థి సంద్యారాణి విజయం సాధించారు. 

9:26 AM IST:

కడప జిల్లాలోని రాజంపేటలోని 1 వ వార్డులో వైసిపి అభ్యర్థి షేక్ సుమియా గెలుపొందారు. ఇక 2వ వార్డులో వైసిపి అభ్యర్థి దాసరి మౌనిక విజయం సాధించారు.  

8:42 AM IST: