యడ్యూరప్పకు ఎసరు: బాబు పాత్ర ఇదీ, కుమారస్వామి వాడిన కారు ఎవరిదో తెలుసా....

Kumaraswamy used TDP MP CM Ramesh car
Highlights

ర్ణాటకలో బిజెపిని దెబ్బ తీయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తన వంతు పాత్ర నిర్వహించినట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్: కర్ణాటకలో బిజెపిని దెబ్బ తీయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తన వంతు పాత్ర నిర్వహించినట్లు తెలుస్తోంది. బలపరీక్షకు సిద్ధపడకుండా యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత చంద్రబాబు బిజెపిపై తీవ్రంగానే ప్రతిస్పందించారు. 

హైదరాబాదుకు వచ్చిన తర్వాత కాంగ్రెసు, జెడిఎస్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి హెచ్ డి కుమారస్వామి వాడిన కారు ఎవరిదో తెలిస్తే అశ్చర్యపోవడం ఖాయం. కుమారస్వామి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కారును వాడారు. 

శుక్రవారం సాయంత్రం కుమారస్వామి హైదరాబాదు వచ్చిన విషయం తెలిసిందే. తొలుత కాంగ్రెసు ఎమ్మెల్యేలు బస చేసిన తాజ్ కృష్ణా హోటల్ కు వచ్చారు. సిఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత తమ ఎమ్మెల్యేలు ఉన్న నోవా టెల్ హోటల్ కు వెళ్లారు. విమానాశ్రయం నుంచి హోటల్ కు రావడానికి, ఇక్కడి నుంచి మరో హోటల్ కు వెళ్లడానికి, ఆ తర్వాత విమానాశ్రయానికి వెళ్లడానికి కుమారస్వామి సిఎం రమేష్ కారును ఉపయోగించుకున్నారు.

శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్లడానికి మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కాంగ్రెసు కోశాధికారి గూడురు నారాయణ రెడ్డి గంటలో స్పెషల్ క్యాప్టర్ ఏర్పాటు చేశారు. 

loader