రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పరిశీలనకు కేఆర్ఎంబీ: ఏపీ షరతు ఇదీ....


రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు గాను కేఆర్ఎంబీ అధికారులు వెళ్లనున్నారు. ఎన్జీటీ   ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. అయితే ప్రాజెక్టు పనుల పరిశీలన సమయంలో తెలంగాణ ప్రతినిధులు ఎవరూ ఉండొద్దని ఏపీ ప్రభుత్వం షరతు విధించింది.
 

KRMB officials to inspect Rayalaseema lift irrigation project lns

 హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను కేఆర్ఎంబీ అధికారులు పరిశీలించనున్నారు.ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించి  నివేదిక ఇవ్వాలని  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేఆర్ఎంబీని ఆదేశించింది.ఈ ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ అధికారులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. గతంలోనే ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్లాలని కేఆర్ఎంబీ అధికారులు ఏపీకి సమాచారం పంపారు. అయితే కరోనా సమయంలో రావొద్దని ఏపీ తేల్చి చెప్పింది.

also read:కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడి భేటీ: ఆ ప్రాజెక్టుల వివరాలివ్వలేమన్న ఏపీ, తెలంగాణ డుమ్మా

ఇటీవలనే ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. దీంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించేందుకు వస్తామని  కేఆర్ఎంబీ అధికారులు తెలిపారు.ఈ బృందంలో తెలంగాణకు ప్రతినిధులు ఎవరూ కూడ ఉండొద్దని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి సూచించింది. ఇవాళ కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ ప్రతినిధులు హాజరయ్యారు. కానీ తెలంగాణ ప్రతినిధులు ఎవరూ కూడ సమావేశంలో పాల్గొనలేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios