Asianet News TeluguAsianet News Telugu

Omicron Medicine రెడీ ..! ఆయూష్ అనుమ‌తిస్తే.. ఆన్‌లైన్‌లో సరఫరా.. Krishnapatnam Anandayya ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌

క‌రోనా  కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు తన వద్ద మందు సిద్ధంగా ఉందని కృష్ణ‌ప‌ట్నం ఆనందయ్య తెలిపారు. దీంతో ఆనందయ్య ఆస‌క్తిక‌రంగా మారాయి. ఆయుష్ నుంచి అనుమతులు వచ్చాక ఆన్లైన్ లో మందు సరఫరా చేయ‌నున్నామని తెలిపారు. అయితే.. క‌రోనా సెకండ్ వేవ్ సంద‌ర్భంలో ఆనందయ్య కరోనా మందుపై అల్లోపతి వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  
 

Krishnapatnam  Anandayya says ayurvedic medicine ready for omicron variant
Author
Hyderabad, First Published Dec 21, 2021, 7:47 PM IST

క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌ల్లో చిక్కుకుని ప్ర‌పంచ దేశాలు ఎన్ని ఇబ్బందులు ప‌డ్డ‌యో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే.. డెల్టా వైర‌స్ వ్యాప్తి త‌గ్గింది అనుకున్న త‌రుణంలో.. క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పుట్టుకొచ్చి మ‌రోసారి ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌రపెడుతోంది. ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో  కొత్త వేరియంట్ శ‌రవేగంగా విస్త‌రిస్తోంది. ద‌క్షిణాఫ్రికా, బ్రిట‌న్‌, అమెరికా దేశాల‌లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. భార‌త్‌లోనూ ఈ వేరియంట్ విజృంభిస్తోంది. ఈ త‌రుణంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. దాదాపు  రెండు వంద‌ల కేసులు న‌మోద‌య్యాయి. 

ఈ క్ర‌మంలో తెలుగు రాష్ట్రాలో కూడా కేసులు వెలుగులోకి వ‌స్తున్నాయి. క్రిస్మ‌స్, నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల నేప‌థ్యంలో జ‌న స‌మూహాలు పెద్ద ఎత్తున క‌న‌ప‌డే అవ‌కాశం ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీంతో ప‌లు ఆంక్షాలు విధిస్తున్నారు.  ఈ త‌రుణంలో ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు తన వద్ద ఔష‌ద‌మున్న‌ట్టు నెల్లూరు కు చెందిన ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో క‌రోనా సెకండ్ వేవ్ వ్యాప్తి వేగంగా ఉన్న‌ప్పుడూ కరోనాకు ఆనందయ్య కనిపెట్టిన ఆయుర్వేద మందు దేశవ్యాప్తంగా మార్మోగింది. కరోనాకు అప్పటికే వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా.. ఆస్పత్రుల్లో చికిత్స చేస్తున్నా వాటిని కాదని, లక్షలాది మంది నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనంద‌య్య కరోనా ఆయుర్వేద మందు వాడారు. ఆయ‌న మందుకు  సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆయన మందు తీసుకున్నారు.  

Read Also: Omicron: భార‌త్ లో ఒమిక్రాన్ డ‌బుల్ సెంచ‌రీ !

అయితే, తాజాగా.. ఒమైక్రాన్ వేరియంట్ కు మందు ఉందంటూ ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో ఇచ్చిన మందుకు మరికొన్ని మూలికలను జోడించి ఈ మందును తయారుచేశామని తెలిపారు. శీతాకాలంలో ఈ ఒమిక్రాన్ వైరస్ ప్రభావం ఎక్కవగా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ క్ర‌మంలో వేరియంట్ రాకుండా ముందస్తుగా.. మందును తీసుకోవాల‌ని ఆనంద‌య్య తెలిపారు. ఒమిక్రాన్‌పై సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు.ఒమిక్రాన్  విస్తరిస్తోన్న నేపథ్యంలో నెల్లూరు ఆనందయ్య చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Read Also: ఓమిక్రాన్ టెస్ట్ ల కోసం కొత్త కిట్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఐసీఎంఆర్
 
తాను త‌యారు చేసిన మందును పేదలందరికీ ఉచితంగా అందిస్తామని ఆనందయ్య పేర్కొన్నారు. ఎక్కువ మోతాదులో కావాలంటే మాత్రం ప్రత్యేకంగా తయారు చేసిస్తామని,తాను త‌యారు చేసిన ఆయుర్వేద మందు వల్ల ఎలాంటి దుష్ఫ్ర‌బావాలు ఉండవ‌ని తెలిపారు. క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో అంద‌జేసిన మందు కంటే.. మరిన్ని అదనపు మూలికల‌ను క‌లిపి ఈ మందును త‌యారు చేసిన‌ట్టు తెలిపారు. వంద‌ శాతం ఒమిక్రాన్‌ పై త‌న‌ మందు పనిచేస్తుంద‌ని తెలిపారు.

Read Also: లిఖితపూర్వంగా హామీ ఇస్తేనే.. ఢిల్లీ నుంచి కదిలేది: తేల్చిచెప్పిన నిరంజన్ రెడ్డి

అయితే..  ఆయుష్ నుంచి అనుమతులు వచ్చాక ఆన్లైన్ లో మందు సరఫరా చేయ‌నున్నామని తెలిపారు.కాగా, క‌రోనా సెకండ్ వేవ్ సంద‌ర్భంలో ఆనందయ్య కరోనా మందుపై అల్లోపతి వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయ‌న మందులో ఎలాంటి శాస్త్రీయ‌త లేద‌ని వైద్యుల తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios