కోయంబేడు పంజా: ఏపీలో విజృంభిస్తున్న కరోనా, మరో 44 కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. కోయంబేడు మార్కెట్ ఇంకా ప్రభావం చూపుతూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 44 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి తెర పడడం లేదు. చెన్నైలోని కోయంబేడు మార్కెట్ ఇంకా ప్రభావం చూపుతూనే ఉంది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 44 కేసులు నమోదయ్యాయి. వీటిలో 14 కేసులు కోయంబెడు మార్కెట్ తో లింకులున్నవే కావడం విశేషం.
రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,671కి చేరుకుంది. ఇప్పటి వరకు 1848 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. మరో 767 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 56 మంది కరోనా వైరస్ తో మరణించారు.
విదేశాల నుంచి వచ్చినవారిలో 62 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అందులో 45 కొత్త కేసులు. వారిలో 41 మంది కువైట్ నుంచి, ముగ్గురు ఖతర్ నుంచి, ఒకరు సౌదీ అరేబియా నుంచి వచ్చినవారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 153 మందికి కరోనా వైరస్ వ్యాధి సంక్రమించింది. వారిలో ఒడిశాకు చెందిన 10 మంది, మహారాష్ట్ర నుంచి వచ్ిచన 101 మంది, గుజరాత్ నుంచి 26 మంది, కర్ణాటక నుంచి వచ్చిన ఒకరు ఉన్నారు. తమిళనాడు వచ్ిచన ముగ్గురు, రాజస్థాన్ నుంచి ఒక్కరు, రాజస్థాన్ నుంచి ఒకరు ఉన్నారు. మొత్తం యాక్టివ్ కేసులు 117 ఉండగా, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు డిశ్చార్జీ అయ్యారు.