Asianet News TeluguAsianet News Telugu

జగన్ కు మరొక దెబ్బ... చిన్నదేలే

విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోలగట్ట వీరభద్ర స్వామి పార్టీని వదిలేశారు.

kolagatal resigns jagans YCP  suffers another blow

ఫిరాయింపు దెబ్బల నుంచి తప్పించుకోలేకపోతున్న ప్రతిపక్ష నాయకుడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరొక దెబ్బ తగిలింది.కాకపోతే, మరీ అంతపెద్దదికాదులే.

 

విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోలగట్ట వీరభద్ర స్వామి పార్టీని వదిలేశారు. ఆయన ఎమ్మెల్సీ కూడా.

 

ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తెలుగుదేశంలో చేరిన వారం రోజులకే ఇపుడొక ఎమ్మెల్సీ ఇలా పార్టీ బయటకు వెళ్లిపోవడం  మంచి పరిణామం కాదు.

 

నిజానికి  ఏ రోజయితే, కాంగ్రెస్ నేత బోత్స సత్యనారాయణను పార్టీలోకి తీసుకుని పెద్ద పీఠ వేశారో ఆ రోజే వీరభ్రద స్వామి వెళ్లిపోవడం ఖాయమని తేలింది. ఇపుడది జరిగింది.


తక్షణ కారణం,మొన్న జరిగిన జగన్ యువభేరి కార్యక్రమంలో తన వర్గానికి ఎలాంటి ప్రాముఖ్యం ఇవ్వలేదని, పూర్తిగా విస్మరించారని, అందుకే ఇంక కొనసాగలేక  ఇలా   గుడ్ బై కొట్టాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. బోత్సకు పార్టీలో ఉన్నప్రాముఖ్యం చూసి తమకిక  భవిష్యత్తు లేదనే ఆందోళన  కోలగట్ట వర్గంలో మొదలయింది. ఈ మధ్య  బలపడింది.

జిల్లా అధ్యక్షుడినయిన తనను పక్కన పెట్టి  తాను చేయాల్సిన పనులు కూడా బొత్స కుటుంబ సభ్యులు చేస్తూ ఉండటంతో  కోలగట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

 

ఈ అసంతృప్తిని జగన్ ఖాతరు చేయకపోవడం, వర్గాల మధ్య సయోధ్యం కుదిరించే ప్రయత్నం చేయకపోవడంతో ఇక వెళ్లిపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. 

 

అందుకే బుధవారం జిల్లా అద్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు కోలగట్ల ప్రకటించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios