Asianet News TeluguAsianet News Telugu

కోడికత్తి కేసులో లోతైన దర్యాప్తు చేయించండి.. హైకోర్టులో జగన్ పిటిషన్...

కోడికత్తి కేసులో వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. లోతైన విచారణ జరిపించాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ నేడు విచారణకు రానుంది. 

Kodikatti case : Jagan's petition in the andhprapradesh High Court - bsb
Author
First Published Oct 13, 2023, 8:12 AM IST | Last Updated Oct 13, 2023, 8:12 AM IST

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ విమానాశ్రయంలో తనపై కోడి కత్తితో దాడికి సంబంధించిన కేసు విషయంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు కోసం జగన్ చేసుకున్న అభ్యర్థనను ఎన్ఐఏ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ.. ముఖ్యమంత్రి హైకోర్టుకు వెళ్లారు. శుక్రవారం నాడు దీనిమీద హైకోర్టులో విచారణ జరగనుంది.

కేసుకు పిటిషన్ నెంబర్ కేటాయించే దశలో రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తాడు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యవహారంపై ఈరోజు విచారించనున్నారు. విశాఖ విమానాశ్రయంలో తనపై కోడి కత్తితో జరిగిన దాడిలో కుట్ కోణం దాగి ఉందని జగన్ ఆరోపించారు. దీనిమీద లోతైన దర్యాప్తు జరపాలని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు.

గంజాయి స్మగ్లర్ల అడ్డాగా గన్నవరం... భారీ సరుకుతో పట్టుబడ్డ అంతర్రాష్ట్ర ముఠా

అది కూడా సాక్షుల విచారణకు షెడ్యూల్ ప్రకటించి వాంగ్మూలాలు నమోదు చేసే దశలో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో కేసులోని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే ఎన్ఐఏ అభియోగపత్రం దాఖలు చేసిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు నేర చరిత్ర ఉందని.. ఆ విషయం పట్టించుకోకుండా.. క్యాంటీన్ నిర్వాహకుడు అతడిని పనిలోకి తీసుకున్నారు అని ఆరోపించారు.  

కోడి కత్తి కేసులో కుట్ర కోణం తెలుసుకునేందుకు మరింత లోతైన విచారణ జరపాలని తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ను జూలై 25వ తేదీన ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది.  దీంతో  వైయస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios