తనపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ స్పందించారు. స్పీకర్ గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లు తెలిపారు. ఎన్టీఆర్, చంద్రబాబు వల్లే తనను ఇన్ని పదవులు వచ్చాయని  ఈ సందర్భంగా తెలిపారు. తన కుటుంబసభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారని తాను గతంలోనే చెప్పినట్లు కోడెల గుర్తు చేశారు.

 తన కుటుంబాన్ని  కొత్త ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని... ఇది మంచి పద్ధతి కాదని కోడెల ఆవేదన వ్యక్తం చేశారు.  తనపై చేసిన ఆరోపణలపై ఒక్క ఆధారం చూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. పధకం ప్రకారమే తన కుటుంబంపై కేసులు పెడుతున్నారని వాపోయారు. 

ప్రభుత్వం అవినీతిరహిత పాలన అందిస్తామంటే సహకరిస్తామన్నారు. అక్రమాలు చేస్తే మాత్రం పోరాటాలు చేస్తామన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని వేధిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రతిపక్షం అసెంబ్లీని బహిష్కరించినప్పుడు సభకు రావాలని చాలా సార్లు విజ్ఞప్తి చేశానని గుర్తుచేశారు.