కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ల భేటీ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరి భేటిపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ల భేటీ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ భేటీ వెనక మతలబు ఏమిటని..? సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ సాగుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్‌ల భేటీలపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఉపయోగం లేకుంటే ఎవరితో నిమిషం కూడా మాట్లాడరని కొడాలి నాని అన్నారు. బీజేపీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అయ్యారని అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపర్చుకోవడానికి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని తాను భావిస్తున్నట్టుగా కొడాలి నాని చెప్పారు. ‘‘జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కాబట్టే.. దేశవ్యాప్తంగా ప్రచారం చేయించుకునే అవకాశం ఉందని కలిశారు. చంద్రబాబుతో ప్రయోజనం లేకపోవడంతోనే మోదీ, అమిత్ షాలు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అన్నారు’’ అని కొడాలి నాని చెప్పారు.
Also Read: అమిత్ షాతో జూ. ఎన్టీఆర్ భేటీ: ఆంధ్ర సెటిలర్ల ఓట్లకు గాలం
ఇక, ఎన్టీఆర్‌ను కలవడం గురించి అమిత్ షా ఓ ట్వీట్ చేశారు. అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, తెలుగు సినిమా తారక రత్నం జూనియర్ ఎన్టీఆర్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో కలుసుకోవడం ఆనందంగా ఉంది.. అంటూ అమిత్‌షా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు రిప్లై ఇస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ట్వీట్ చేశారు. ‘‘మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది అమిత్ షా జీ. మీరు నాగురించి మాట్లాడిన మాటలకు ధన్యవాదాలు’’ అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.
