అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే రమేష్ కుమార్ ప్రయత్నాలను ఆయన వ్యతిరేకించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇక్కడ కొన్ని నెలలే ఉంటారని, ఆ తర్వాత హైదరాబాదులోని తన ఇంటికి వెళ్లిపోతారని ఆయన అన్నారు. 

బీహార్ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చవద్దని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బీహార్ శానససభ ఎన్నికలను నిర్వహించక తప్పని అనివార్య పరిస్థితి ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని, నిపుణులను సంప్రదించిన తర్వాత బీహార్ ఎన్నికలను నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. 

తమ ప్రభుత్వానికి ఇప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని నాని స్పష్టం చేశఆరు. ప్రభుత్వాన్ని సంప్రదించకుం ఎన్నికలు నిర్వహిస్తామని నిమగడ్డ రమేష్ కుమార్ అనుకుంటే కుదరదని ఆయన అన్నారు ప్రభుత్వానికి చెప్పకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమీ చేయలేరని ఆయన అన్నారు. 

తాను చెప్పిందే రాజ్యాంగమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే కుదరదని ఆయన అన్నారు. ఎన్నికలు నిర్వహించాలంటే కోరనా కాలంలో పలు నియమనిబంధనలను పాటించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఎంతో మంది వచ్చి ఓటు వేయాల్సి ఉంటుందని ఆయన చెప్ాపరు 

కరోనా నియమాలను పాటించాలంటే బూత్ లు పెంచాల్సి ఉంటుందని, ఎన్నికల సామగ్రిని శానిటైజ్ చేయాల్సి ఉంటుందని, వాటన్నింటిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంతో చర్చించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.