Asianet News TeluguAsianet News Telugu

ముహుర్తం ఫిక్స్: 28న వైసీపీలోకి కిల్లి కృపారాణి

ఏపీ ప్రజలు చంద్రబాబును విశ్వసించరన్నారు మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో జగన్‌తో సమావేశమైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తును తాను వ్యతిరేకించానని, ఇదే విషయంపై పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా లేఖ రాశానని ఆమె స్పష్టం చేశారు. ఈ నెల 28న అమరావతిలో వైసీపీలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు. 

killi kruparani joining ysrcp
Author
Hyderabad, First Published Feb 19, 2019, 12:25 PM IST

ప్రత్యేకహోదా విషయంలో సీఎ: మాట మార్చారని, ఏపీ ప్రజలు చంద్రబాబును విశ్వసించరన్నారు మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో జగన్‌తో సమావేశమైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తును తాను వ్యతిరేకించానని, ఇదే విషయంపై పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా లేఖ రాశానని ఆమె స్పష్టం చేశారు. ఈ నెల 28న అమరావతిలో వైసీపీలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు.

బీసీ గర్జనలో జగన్ ఇచ్చిన హామీలు నచ్చాయని కృపారాణి తెలిపారు. బీసీలంటే భారతదేశ సంస్కృతి, సాంప్రదాయలని .. ఈ దేశ వారసత్వాన్ని, గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు తెలియజేయాలంటే బీసీలు అవసరమని జగన్ చెప్పిన విధానం బాగుందన్నారు.

తినే తిండి నుంచి ఎక్కే బండి వరకు బీసీలను వాడుకుంటున్నారని.. ఆ వర్గానికి ఎవ్వరూ సముచిత స్థానం ఇవ్వలేదని అధికారంలోకి వచ్చిన వెంటనే తాను వారికి సముచిత స్థానం కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు.

ప్రతి ఒక్క బీసీ కులానికి కార్పోరేషన్ పెట్టి వారి సంక్షేమం కోసం పాటుపడతానని జగన్ చెప్పారన్నారు. మాట తప్పని, మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా జగన్‌పై తనకు నమ్మకం ఉందని కిల్లి కృపారాణి ఆశాభావం వ్యక్తం చేశారు.

నాలుగేళ్ల క్రితం బీజేపీతో అంటకాగి, నేడు మోడీపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు ప్రసంగాన్ని చూసి.. తాను టీడీపీ మీటింగ్ చూస్తున్నానా..? లేక కాంగ్రెస్ పార్టీ సభ చూస్తాన్నానా అని భ్రమ పడ్డానని కృపారాణి అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios