విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు.. కిడ్నీమార్పిడి చేస్తున్న ఆర్థోపెడిక్.. పేదలే టార్గెట్...

పేదలను టార్గెట్ చేసి, డబ్బు ఆశ చూపి కిడ్నీలు కాజేస్తున్న ఓ ముఠా గుట్టు బయటపడింది. పెందుర్తిలోని ఓ ఆస్పత్రిలో ఈ నేరాలకు పాల్పడుతున్నట్లుగా తేలడంతో పోలీసులు సోదాలు చేస్తున్నారు.

Kidney racket busted in Visakhapatnam, Orthopedic doing kidney transplant - bsb

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. పేదవారిని టార్గెట్ చేస్తూ.. డబ్బులు ఆశచూపి కిడ్నీలు కాజేస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కిడ్నీ మార్పిడి యూనిట్ లేకుండానే కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నాడు ఓ డాక్టర్. పేదవాళ్లు టార్గెట్ చేసి అవయవ వ్యాపారం చేస్తున్నారు నిందితులు. దీనికి సంబంధించిన సమాచారం అందడంతో  ఈ కిడ్నీ రాకెట్ గుట్టు తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

పెందుర్తి తిరుమల ఆసుపత్రిలో డిసిపి తన సిబ్బందితో సోదాలు చేస్తున్నారు. కిడ్నీ మార్కెట్ యూనిట్ లేకుండా సర్జరీ చేయడంపై పోలీసుల ఆరా తీస్తున్నారు. కిడ్నీ మార్పిడిని ఆర్థోపెడిక్ సర్జన్ పరమేశ్వరరావు చేస్తుండడంతో..  ఆర్థోపెడిక్ సర్జన్ కు కిడ్నీ ఆపరేషన్ చేస్తే అర్హత కోణంలో విచారణ చేస్తున్నారు. 

ఏపీ భవన్ విభజన : ముగిసిన కేంద్ర హోంశాఖ సమావేశం, కుదరని ఏకాభిప్రాయం.. మళ్లీ వచ్చేవారం

ఈ కేసు వెలుగులోకి రావడంతో ఆస్పత్రినుంచి డాక్టర్  పరమేశ్వరరావు పరారయ్యాడు. ఆస్పత్రి అంతా ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉంది. ఈ కిడ్నీ రాకెట్ లో దళారులు ఇలియాన్, శ్రీను, కామరాజు కీలకంగా ఉన్నారు. వీరే పేదవారిని టార్గెట్ చేసి కిడ్నీకి  ఎనిమిదిన్నర లక్షలు ఇప్పిస్తామని చెబుతూ.. వారిని బుట్టలో వేసుకుంటున్నారు.  ఆ తరువాత మాట్లాడుకున్న మొత్తంతో సగానికి సగం తగ్గించి ఇస్తూ.. ఆపరేషన్ తరువాత వారిని పట్టించుకోవడంలేదు.

ఈ విషయం వెలుగులోకి రావడంతో దళారులు అడ్రస్ లేకుండా పోయారు. వీరి బారిన పడిన వినయ్ అనే యువకుడు దయనీయ స్థితిలో ఉన్నాడు.  ప్రస్తుతం కదలిలేని స్థితిలో ఉన్నాడు వినయ్. మాట్లాడడానికి కూడా రాని పరిస్థితిలో ఉన్నాడు. తన తండ్రితో వారు ఏదో ఒప్పందం చేసుకున్నారని.. తాను హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటుంటే.. తనను బెదిరించి.. డబ్బులు తీసుకున్నాడు మీ నాన్న రాకపోతే సామానంతా నాశనం చేస్తామని బెదిరించడంతో తాను కిడ్నీ ఇచ్చానని చెప్పుకొచ్చాడు. 

ఈ దళారుల బారిన దాదాపు 10,12 మంది పడి ఉంటారని తెలుస్తోంది. ఒక్కోకరికీ ఒక్కో రేటు చెబుతున్నారు. మరో కేసులో 5 లక్షలు వారికి ఇస్తున్నట్లుగా వీడియో సాక్ష్యం తీసుకున్నారు. కానీ వారికి అందించింది రూ.2.5 లక్షలు మాత్రమే. వీటికి సంబంధించి పెందుర్తి ఆసుపత్రిలో తనిఖీలు జరుగుతున్నాయి. సోదాల తరువాత డీసీపీ మాట్లాడే అవకాశం ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios