Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని వల్లే ఏపికి కియా మోటార్స్

  • హ్యూందాయ్ కార్ల యాజమాన్యంతో జరిపిన చర్చల వల్లే కియా కంపెనీ తయారీ కేంద్రం అనంతపురం జిల్లాకు వచ్చిందని ఇంతకాలం చంద్రబాబు చెప్పుకుంటున్నారు.
Kia motors anantapur plant credit goes to PM not Chandrababu Naidu

చంద్రబాబునాయుడు గాలి తీసేసింది కియా మోటార్స్ కంపెనీ. కొరియాకు వెళ్ళినపుడు హ్యూందాయ్ కార్ల యాజమాన్యంతో జరిపిన చర్చల వల్లే కియా కంపెనీ తయారీ కేంద్రం అనంతపురం జిల్లాకు వచ్చిందని ఇంతకాలం చంద్రబాబు చెప్పుకుంటున్నారు. కియో మోటార్స్ హ్యూందాయ్ అనుబంధ కంపెనీ అన్న విషయం తెలిసిందే. తన కృషి వల్లే కియా మోటార్ కంపెనీ రాష్ట్రానికి వచ్చిందని ఊరూవాడ చంద్రబాబు టముకేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే కదా?

అయితే, తాజాగా వెలుగు చూసిన వివరాలు ప్రకారం కియా మోటార్స్ అనంతపురంలో ఉత్సత్తి ప్లాంట్ ఏర్పాటు చేయటంలో చంద్రబాబు కృషి ఏమీ లేదట. 2015లో ప్రధానమంత్రి నరేంద్రమోడి కొరియాలో పర్యటించారు. అప్పుడు కొరియా అధ్యక్షునితో జరిపిన సమావేశంలో హ్యూందాయ్ కార్ల అనుబంధ పరిశ్రమ కియా మోటార్స్ ఉత్పత్తి ప్లాంట్ ఇండియాలో పెట్టాలని నిర్ణయమైంది.

అయితే ఇండియాలో ఇప్పటికే చెన్నైలో రెండు ప్లాంట్లూ ఉత్పత్తిలో పూర్తి సామర్ధ్యాన్ని చేరుకున్నాయి. అందుకని చెన్నైకి దగ్గర్లో ఉంది కాబట్టి, నేషనల్ హై వేకి పక్కనే 400 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి హ్యూందాయ్ కంపెనీనే అనంతపురం జిల్లాను ఎంచుకున్నది. కాకపోతే జిల్లాలోని పెనుకొండలో ప్లాంట్  ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించి ఉండవచ్చు.

చంద్రబాబు కొరియా పర్యటించినపుడు ఏపిలో ప్లాంట్ ఏర్పాటు చేయమని మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేసి ఉండవచ్చు. అదికూడా ఇండియాలో మూడో ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు ప్రధాని పర్యటనలో నిర్ణయమైపోయిన విషయం తెలుసుకుని. ఎలాగూ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయమైపోయింది. అదికూడా చెన్నైకి దగ్గర్లోనే మూడో ప్లాంట్ కావాలి. చెన్నై-అనంతపురం దగ్గర్లోనే ఉన్నాయి కాబట్టి హ్యూదాయ్ కంపెనీ యాజమాన్యం కూడా ఓకే చెప్పివుండవచ్చు. అంతమాత్రాన చంద్రబాబు కృషి వల్లే కియా మోటార్స్ కంపెనీ రాష్టానికి రాలేదన్న విషయం ఇపుడు స్పష్టమైపోయింది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios