ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై అధ్యయనం చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ముఖ్యమంత్రి జగన్‌కి శుక్రవారం తన నివేదికను సమర్పించింది. రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసిన బీసీజీ గ్రూప్ ఇప్పటికే ఓ మధ్యంతర నివేదికను అందజేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సదరు నివేదికలో ఏముందనే దానిని పరిశీలిస్తే.. ఎక్కువగా బహుళ రాజధానులపైనే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందుకు గాను దేశంలో  బహుళ రాజధానులున్న రాష్ట్రాల స్థితిగతులపై బీసీజీ అధ్యయనం చేసింది.

Also Read:రాజధాని రచ్చ: జగన్‌ చేతిలో బోస్టన్ కమిటీ నివేదిక

అలాగే రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణను నివేదికలో ప్రస్తావించింది. దీనిలో భాగంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన అంశాలను సూచించిన బోస్టన్ నివేదికలో పొందుపరిచారు. రాష్ట్రంలో సమతుల్య సమగ్ర అభివృద్ధిపై రిపోర్టులో తెలిపింది.

అన్నింటికంటే ముఖ్యంగా అమరావతి ప్రాంత అభివృద్ధి వ్యూహాన్ని నివేదికలో సూచించింది. అభివృద్ధి సూచికలవారీగా జిల్లాల పరిస్ధితులను వివరించడంతో పాటు ప్రాంతాలవారీగా ఎంచుకోవాల్సిన అంశాలను బీసీజీ తన నివేదికలో వెల్లడించింది. వ్యవసాయం, పర్యాటకం, పరిశ్రమలు, మత్స్య రంగాలపై నివేదికలో పేర్కొంది. 

Also Read:రాజధానంటే మూడు ముక్కలాట అనుకుంటున్నాడు: జగన్‌పై బాబు ఫైర్

జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ కమటిటీ నివేదికలను అధ్యయనం చేసేందుకు గాను  హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 6వ తేదీన హై పవర్ కమిటీ సమావేశం కానుంది. జీఎన్  రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ నివేదికలపై చర్చించనుంది.ఈ నెల 20వ తేదీ లోపుగా హై పవర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.