అమరావతి:బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు  నివేదిక ఇచ్చింది. రాజధాని నిర్మాణంపై  బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. 
ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో  సమగ్ర అభివృద్దిపై జీఎన్ రావు కమిటీ నివేదికను ఇచ్చింది.

also read:అమరావతి రైతులకుషాకిచ్చిన పోలీసులు: హత్యాయత్నం కేసులు

ఇప్పటికే బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది.మధ్యంతర నివేదికలో బ్రౌన్ ఫీల్డ్ రాజధాని వైపు సిఫారసులు చేసింది. బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ పూర్తి స్థాయి నివేదికను ఇవాళ సీఎం జగన్‌కు ఇచ్చింది.

Also read:నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటా: ఆళ్ల సంచలనం

జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ కమటిటీ నివేదికలను అధ్యయనం చేసేందుకు గాను  హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 6వ తేదీన హై పవర్ కమిటీ సమావేశం కానుంది. జీఎన్  రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ నివేదికలపై చర్చించనుంది.ఈ నెల 20వ తేదీ లోపుగా హై పవర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

Also read:రాజధాని రచ్చ: 29 గ్రామాల్లో సకల జనుల సమ్మె