కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన టీడీపీ అభ్యర్థి కేఈ ప్రభాకర్ శుక్రవారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల బరిలో పోటీ లేకపోవటంతో కెఇ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. కేఈ ప్రభాకర్‌ నామినేషన్‌ ఒక్కటే రవాటంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ప్రకటించారు. గత ఏడాది మే 17న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై 62 ఓట్ల తేడాతో గెలిచారు. నంద్యాల ఉప ఎన్నికలో వైసిపి అభ్యర్ధిగా పోటీ చేసిన తన సోదరుడు శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతుగా  ఆగస్టు 3న శిల్పా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ స్ధానానికి జరిగిన ఎన్నికలోనే కెఇ ప్రభాకర్ గెలిచారు.