రేపు విజయవాడకు కేసీఆర్: కనకదుర్గమ్మకు మొక్కు

First Published 27, Jun 2018, 1:30 PM IST
KCR to visit Vijayawada
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రేపు గురువారం విజయవాడ వెళ్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రేపు గురువారం విజయవాడ వెళ్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు ఆయన మొక్కు తీర్చుకుంటారు. తెలంగాణ వస్తే తాను ముక్కుపుడక సమర్పించుకుంటానని ఆయన ఉద్యమ కాలంలో మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చడానికి ఆయన విజయవాడ వెళ్తున్నారు. 

రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. ఇప్పటికే ఆయన వరంగల్ లోని భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం సమర్పించారు.

తిరుపతిలోని తిరుచనూరులో గల పద్మావతి అమ్మవారికి ముక్కు పుడక, కురవిలోని వీరభద్రస్వామికి బంగారు మీసాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మొక్కులు తీర్చుకుంటానని చెప్పిన కేసిఆర్ వాటి కోసం రూ.59 లక్షలు కేటాయించారు. 

loader