Asianet News TeluguAsianet News Telugu

కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అరెస్ట్

నెల్లూరు జిల్లా కావలి వైసీపి ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే, వైసిపి పార్టీ లీడర్ ప్రతాప్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 

kavali mla pratap reddy arrest

నెల్లూరు జిల్లా కావలి వైసీపి ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే, వైసిపి పార్టీ లీడర్ ప్రతాప్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 

 మత్స్యకార గ్రామమైన చంద్రబాబు నగర్ లో ఎమ్మెల్యే పర్యటనను శాంతిభద్రత దుష్ట్యా జిల్లా ఎస్పీ అంగీకరించలేదు. ఈ నెల 27 వరకు ఓపిక పట్టాలని ఎమ్మెల్యేను సూచించారు. అయితే సమయం మించిపోవడంతో మత్య్యకార గ్రామానికి బయలుదేరిన ఎమ్మెల్యేను,కార్యకర్తలను నెల్లూరు వైసీపి కార్యాలయం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. 

ఎమ్మెల్యే అరెస్టుతో వైసీపి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారీగా పోలీసులను మొహరించి ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా బందోబస్తు చేపట్టారు. వైసిపి కార్యకర్తలను, నాయకులను అక్కడినుండి వెళ్ళగొట్టి పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

జిల్లా ఎస్పీ సూచనల మేరకు ఇప్పటికే ప్రతాప్ రెడ్డి మత్స్యకార గ్రామానికి పోకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే పోలీసులను తప్పించుకుని ఎమ్మెల్యే బైటికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపుతోకి తీసుకున్నారు. ఎమ్మెల్యుతో పాటు ఆయన అనుచరులు, వైసీపి కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios