కోడెల శివప్రసాద్ కి షాక్..

karimnagar court shock to kodela shiva prasad rao
Highlights

కోడెలకు చుక్కెదురైంది.
 

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కి కరీంనగర్ కోర్టులో చుక్కెదురైంది.  జూన్ 18వ తేదీన న్యాయస్థానంలో హాజరు కావాల్సిందిగా స్పెషల్‌ మొబైల్‌ కోర్టు కోడెలను ఆదేశించింది. 2014 ఎన్నికల్లో 11 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశానని ఓ టీవి ఛానల్‌ ఇంటర్వూలో తెలిపారు. దీంతో ఎన్నికల నిబంధలనను ఉల్లంఘించిన కోడెలను అనర్హులుగా ప్రకటించాలని కరీంనగర్‌కు చెందిన సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు.

దీంతో కోడెలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అవ్వడంతో,  2017 మార్చి 7న కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే కోడెల హైకోర్టును ఆశ్రయించి.. కోర్టుకు స్వయంగా హాజరుకాలేనని స్టే ఆర్టర్‌ తెచ్చుకున్నారు. దీంతో స్టే ఆర్డర్‌ను సవాల్‌ చేస్తూ, ఇటీవల సుప్రీంకోర్డు ఇచ్చిన ఆదేశాల ప్రకారం భాస్కర్ రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో వాదోపవాదనల అనంతరం జూన్‌ 18న కోడెల స్వయంగా కరీంనగర్‌ కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి రాజు ఆదేశించారు.

loader