అసలు ఏం జరిగింది

ఎన్నికల వ్యయంపై దాఖలైన కేసులో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కోర్టుకు రావాల్సిందేనని కరీంనగర్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ‘ పీసీఆర్‌ ‘ ఆదేశించారు. కరీంనగర్‌కు చెందిన భాస్కర్‌రెడ్డి కోడెలపై కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేయగా 2017 ఫిబ్రవరి 28న కేసు నమోదైంది. కోడెల 2016 జూన్‌ 19న ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఎన్నికల వ్యయం రూ. 11.5 కోట్లు అయిందని చెప్పారని.. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉందని, ఆయనను అనర్హులుగా ప్రకటించాలని భాస్కర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. జూన్‌ 18న కోడెల కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.