ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చంద్రబాబే చిచ్చుపెట్టారంటూ కరణంబలరాం మండిపడ్డారు. ఇందుకు ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలంటూ ఊగిపోయారు.  విషయమేంటో చంద్రబాబుతోనే తేల్చుకుంటానంటూ 

చంద్రబాబునాయుడుపై టిడిపి సీనియర్ నేత, ఎంఎల్సీ కరణంబలరాం ఫైర్ అయ్యారు. అసలే కరణం ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న వ్యక్తి. దానికి తోడు వైసీపీ నుండి ఎంఎల్ఏ గొట్టిపాటిరవిని పార్టీలోకి చేర్చుకోవటం ఏమాత్రం సహించలేకపోతున్నారు. ఆ విషయాన్ని అప్పట్లో చంద్రబాబు మొహం మీదే చెప్పారు కూడా. అయినా చంద్రబాబు వినిపించుకోలేదు. దానికితగ్గట్లే గొట్టిపాటి పార్టీలో చేరినప్పటి నుండి రెండు వర్గాల మధ్య ఘర్షలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఒకళ్ళను మరొకళ్ళు చంపుకునేదాకా ఏనాడు దాడులు జరగలేదు.

అయితే, శుక్రవారం అర్ధరాత్రి గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు జరిపిన దాడిలో కరణం మద్దతుదారులు ఇద్దరు మరణించారు. దాంతో అప్పటి నుండి గొట్టిపాటి, చంద్రబాబులపైన కరణం మండిపోతున్నారు. గొట్టిపాటికి చెందిన గ్రానైట్ క్వారీ మూతపడటమే గొడవలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చంద్రబాబే చిచ్చుపెట్టారంటూ కరణంబలరాం మండిపడ్డారు. ఇందుకు ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలంటూ ఊగిపోయారు. విషయమేంటో చంద్రబాబుతోనే తేల్చుకుంటానంటూ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంఎల్ఏని తమపై బలవంతంగా రుద్ది తమ వర్గీయులను గొడవల్లోకి లాగటం దారుణమంటూ మండిపడ్డారు.