కాపులకు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశ్యంతోనే మంజూనాధ కమీషన్ వేసినట్లు చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ మంజూనాధ కమీషన్ ఇచ్చిన నివేదికను ముందు పార్టీలో చర్చకు పెడతారట. తర్వాత ప్రజల్లో కూడా చర్చకు ఉంచుతారట. తర్వాత నిర్ణయం తీసుకుంటారట. ఇదంతా ఎప్పటికయ్యేను?
చంద్రబాబునాయుడు చెప్పిన పద్దతిలో అయితే కాపులకు రిజర్వేషన్లు వచ్చేది అనుమానమే. విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభమైన పసుపు పండుగ మహానాడులో చంద్రబాబు మాట్లాడారు. సిఎం మాట్లాడుతూ, కాపులకు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశ్యంతోనే మంజూనాధ కమీషన్ వేసినట్లు చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ మంజూనాధ కమీషన్ ఇచ్చిన నివేదికను ముందు పార్టీలో చర్చకు పెడతారట. తర్వాత ప్రజల్లో కూడా చర్చకు ఉంచుతారట. తర్వాత నిర్ణయం తీసుకుంటారట. ఇదంతా ఎప్పటికయ్యేను?
కాపులకు రిజర్వేషన్లు అన్నది పోయిన ఎన్నికల్లో తనంతట తానుగా చంద్రబాబు ఇచ్చిన హామీ. తానిచ్చిన హామీ ఆచరణ సాధ్యం కాదన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా ఎందుకిచ్చారు? కేవలం ఎన్నికల్లో లబ్ది పొందేందుకే. హామీ లక్ష్యం నెరవేరింది. చంద్రబాబు సిఎం అయ్యారు. తర్వాత ఎన్నికల హామీ అటకెక్కింది. హామీ అమలు కోసం ఎదురుచూసిన కాపు నేతలు మెల్లిగా డిమాండ్లు మొదలుపెట్టారు.
అందులో భాగమే ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆందోళనలు. తప్పని పరిస్ధితుల్లో మాత్రమే చంద్రబాబు మంజూనాధ కమీషన్ వేసారు. అది ఎప్పటికి నివేదిక ఇస్తుందో ఎవరికీ తెలీదు. ఆ నివేదికలో ఏముంటుందో కూడా ఎవరు చెప్పలేరు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లోగా నివేదిక ఇచ్చే అవకాశమైతే ఉంది. ఎందుకంటే, మళ్లీ ఎన్నికల ప్రచారంలో కాపులకు రిజర్వేషన్ గురించి మాట్లాడాలి కద?
