ఎప్రిల్ లో 13 జిల్లాల కాపు నాయకుల సమావేశం, ఆ తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమం ఉధృతం, విస్తృతం
కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తూర్పు గోదావరి ఎల్లలు దాటించి రాష్ట్ర వ్యాపితం చేసేందుకు ముద్ర గడ పద్మనాభం చేసిన తొలిప్రయత్నం ఫలించింది. ఆయన కర్నూల్ పట్టణానికి వచ్చారు.ఆదివారం కర్నూలు లోని మెగాసిరి ఫంక్షన్ హాలులో కాపు, తెలగ, బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక రోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు (పక్క ఫోటో).

కాపులకు బిసి హోదా కల్పించే డిమాండ్ గురించి మాట్లాడుతూ, 2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేపట్టినప్పుడల్లా చంద్రబాబు నాయుడు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. అయితే, అధికారంలోకి రాగానే మరిచిపోయారని, ఆ విషయం ఆయనకు గుర్తు చేసేందుకే ఈ ఉద్యమం తప్ప మరొక లక్ష్యంతో సాగడం లేదని ఆయన స్పష్ట పరిచారు.
ఈ ఉద్యమాని ప్రజల మద్దతు తప్ప ఎవరి నుంచి ఎలాంటి సహాయ పొందడం లేదని అంటూ వైఎస్ జగన్ నుంచి తాము ఎలాంటి సాయం పొందలేదని, చంద్రబాబే జగన్ తండ్రి నుంచి సాయం పొందారని ముద్రగదడ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు బావమరది బాలకృష్ణ కాల్పుల కేసులో ఇరుక్కున్నపుడు నెంబరు లేని కారులో వైఎస్ వద్దకు వెళ్లి కేసు లేకుండా చేసుకున్నారని ఆయన చెబుతూ కాపు ఉద్యమకారులు ఇలాంటి సహాయం కోరరని అన్నారు.
కాపు ఉద్యమ కార్యకర్తలు ఎక్కడ సమావేశమయిన ,కలసి భోజనాలు చేసినా, సమావేశాలు పెట్టినా, ఫ్లెక్సీలు కట్టినా ప్రభుత్వం బెదిరించడం ఎమిటని ఆయన ప్రశ్నించారు.
‘2016 ఫిబ్రవరిలో మేం ఆందోళన చేసినపుడు ఎమి హామీ ఇచ్చారు. ఆగస్టులోపు కాపులను బీసీల్లో చేర్చుతామని అన్నారు. తర్వాత కమి టి నివేదిక రావాలి అన్నారు. ఇపుడు 2017 ఫిబ్రవరి. కమిటీ నివేదిక రాదు, మీ హామీ నెరవేర్చరు. ఆగస్టులో కమిటీ పెట్టి కాలయాపన చేస్తున్నారు. ఇంతకంటే మోసం ఎముంటుంది. దీనిని ప్రశ్నించరాదంటారా?’ అని ముద్రగడ అడిగారు.
ఇది ఇలా ఉంటే, ముద్రగడ కర్నూలు దీక్షకు మద్దతుగా-
తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఆదివారం నాడు సత్యాగ్రహాలు జరిపారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సత్యాగ్ర హాలు ప్రశాంతగా సాగాయి. ముద్రగడ లేకపోవడంతో, పోలీసుల కూడ అనుమతి లేదనే సాకుత్ వాటిని ఎత్తివేసే ప్రయత్నం చేయలేదు.
కాపు జెఎసి నేతలు వాసిరెడ్డి ఏసుదాసు కాకినాడలో, కల్వకుంట తాతాజీ కోనసీమలో, గొల్లపల్లి కాశీ విశ్వనాధం ప్రత్తిపాడులో, తూము చినబాబు కిర్లంపూడిలో జరిగిన సత్యాగ్రహాలలో పాల్గొన్నారు.
