చంద్రబాబు స్థాయికి మోడీ అక్కర్లేదు... నేను చాలు.. దమ్ముంటే చర్చకు రండి: కన్నా

kanna laxminarayana comments on chandrababu naidu
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ల అంశంపై మాట తప్పిన ఘనత చంద్రబాబుదేనని..ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చిన ఆయన మాట తప్పారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ల అంశంపై మాట తప్పిన ఘనత చంద్రబాబుదేనని..ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చిన ఆయన మాట తప్పారని ఆరోపించారు. రిజర్వేషన్ అంశాన్ని కేంద్రప్రభుత్వానికి పంపి బాబు చేతులు దులుపుకోవాలని భావించారని లక్ష్మీనారాయణ విమర్శించారు..

. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తే చంద్రబాబు వ్యతిరేకించారని.. తుని ఘటనలో కాపులపైనా, ముద్రగడపైనా టీడీపీ ప్రభుత్వం అనేక తప్పుడు కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. బీసీ నాయకులను రెచ్చగొట్టి కాపులపై దాడులు చేయించారని.. బీసీలకు అన్యాయం జరక్కుండా కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్రప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని కన్నా తెలిపారు.

కడప స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్‌లను కేంద్రప్రభుత్వం ఇవ్వడం లేదని తెలుగుదేశం అనుకూల మీడియా రాస్తోందని.. ఇది సరైనది కాదని కన్నా పేర్కొన్నారు.. జోన్ కచ్చితంగా ఇస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంగా తెలిపారన్నారు. హోదాపై అనేక సార్లు ముఖ్యమంత్రి మాట మార్చారని.. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.

40 ఏళ్ల అనుభవాన్ని చంద్రబాబు అవినీతి చేయడానికే ఉపయోగిస్తున్నారని ఎద్దేవా చేశారు..బాబు స్థాయికి ప్రధాని మోడీ అవసరం లేదని.. తాను చాలునని రాష్ట్రాభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని లక్ష్మీనారాయణ సవాల్ విసిరారు. హిందుత్వంపై ముఖ్యమంత్రి దాడికి దిగుతున్నారని.. దీనిలో భాగంగానే శివస్వామిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.

loader