అనంతపురం: తనను చంపేందుకు తెలుగుదేశం వాళ్లు ప్రయత్నించారని బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. అనంతపురంలో గురువారం టీడీపీ, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మినారాయణ ఆ ఆరోపణ చేశారు. 

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి సమగ్రాభివృద్ధి సాధిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

పోలీసుల అండతోనే తమపై దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో 50,914 గృహాలు మంజూరు చేస్తే వాటిలో ఎన్ని నిర్మించారని ఆయన ప్రశ్నించారు.