నంద్యాల ఉపఎన్నిక ఫలితం తర్వాత కాపుల ఓట్ల విషయంలో ముద్రగడకు పెద్ద పరీక్షే ఎదురైంది. ఎలాగంటే, టిడిపికి వ్యతిరేకంగా కాపులందరూ నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓట్లు వేయాలని కాపుఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ముద్రగడ పిలుపుకు నంద్యాలలో ఎంతమంది స్పందించారో స్పష్టంగా తెలీదు. నంద్యాల ఫలితం చూసిన తర్వాత బలిజ(కాపు)ల ఓట్లు టిడిపి పడటంలో ముద్రగడ పిలుపు ప్రభావంపై అనుమానాలు మొదలయ్యాయి.
నంద్యాల ఉపఎన్నిక ఫలితం తర్వాత కాపుల ఓట్ల విషయంలో ముద్రగడకు పెద్ద పరీక్షే ఎదురైంది. ఎలాగంటే, టిడిపికి వ్యతిరేకంగా కాపులందరూ నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓట్లు వేయాలని కాపుఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే, ముద్రగడ పిలుపుకు నంద్యాలలో ఎంతమంది స్పందించారో స్పష్టంగా తెలీదు. నంద్యాల ఫలితం చూసిన తర్వాత బలిజ(కాపు)ల ఓట్లు టిడిపి పడటంలో ముద్రగడ పిలుపు ప్రభావంపై అనుమానాలు మొదలయ్యాయి. సరే, నంద్యాల ఎన్నిక చరిత్రైపోయింది. ఇక మిగిలింది కాకినాడ కార్పొరేషన్ ఎన్నికే.
కార్పొరేషన్లోని 48 డివిజన్లకు మంగళవారం పోలింగ్ జరుగుతోంది. అయితే, నంద్యాల-కాకినాడ మధ్య చాలా తేడాలున్నాయి. రాయలసీమలోని ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో నంద్యాల కూడా ఒకటి. ఇక్కడ సామాజిక వర్గాలు, అభివృద్ధి, సెంటిమెంట్ కన్నా వర్గ రాజకీయాలదే పెద్ద పీట. కాబట్టి బలిజలు టిడిపికి ఓట్లు వేయటంలో ముద్రగడ మాట ఏ మేరకు చెల్లుబాటయ్యిందో అనుమానమే. ఒకవేళ ముద్రగడ మాటకే గనుక బలిజలు సానుకూలంగా స్పందించి ఉంటే టిడిపికి ఈ స్ధాయి మెజారిటీ సాధ్యమయ్యేదే కాదు.
ఇక, కాకినాడ విషయాన్ని తీసుకుంటే, నంద్యాల వాతావరణంకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ సామాజికవర్గాలదే ఆధిపత్యం. టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేయమని ముద్రగడ ఇచ్చిన పిలుపు కాకినాడలో ఎక్కువ ప్రభావం చూపాలి. ఎందుకంటే కార్పొరేషన్ పరిధిలో కాపుల ఓట్లు సుమారుగా 45 వేలున్నాయి. అంతేకాకుండా ముద్రగడ సొంతూరు కిర్లంపూడి, కాకినాడకు దగ్గరే. కాబట్టి సహజంగా అయితే ప్రస్తుత పరిస్ధితిల్లో ముద్రగడ మాట చెల్లుబాటవ్వాలి. మరి చెల్లుబాటవుతుందా? కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక ఒకరకంగా సామాజిక వర్గంపై ముద్రగడకున్న పట్టుకు పెద్ద పరీక్షే అనటంలో సందేహం లేదు.
