జి. రాగంపేట ఆయిల్ ఫ్యాక్టరీ సీజ్: ప్రమాదంపై మూడు రోజుల్లో నివేదిక కోరిన కలెక్టర్
కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం జి. రాగంపేటలో ప్రమాదం జరిగిన ఆయిల్ ఫ్యాక్టరీని అనుమతి లేదని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు.
కాకినాడ: జిల్లాలోని పెద్దాపురం జి.రాగంపేట ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదంపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. గురువారం నాడు మధ్యాహ్నం ప్రమాదనం జరిగిన ఫ్యాక్టరీని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పెద్దాపురం మండలం జి. రాగంపేట ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్ శుభ్రం చేసేందుకు వెళ్లిన ఏడుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనపై విచారణకు ఐదుగురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్టుగా కృతికా శుక్లా తెలిపారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకొంటామని కలెక్టర్ ప్రకటించారు.
ప్రమాదానికి కారణమైన ఫ్యాక్టరీని సీజ్ చేసినట్టుగా కలెక్టర్ చెప్పారు ఈ ఫ్యాక్టరీని అనుమతి లేదన్నారు. కేవలం గోడౌన్ గా మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు,మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 25 లక్షలు, ఫ్యాక్టరీ యాజమాన్యం తరపున రూ. 25 లక్షలు ఇవ్వనున్నట్టుగా కలెక్టర్ తెలిపారు. 15 రోజుల్లో బాధిత కుటుంబాలకు పరిహరం చెల్లించనునన్నట్టుగా కలెక్టర్ శుక్లా తెలిపారు.
also read:జి.రాగంపేట ఆయిల్ ఫ్యాక్టరీలో ఏడుగురు మృతి: కుటుంబ సభ్యుల ఆందోళన
ఇవాళ ఉదయం ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తున్న సమయంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. తొలుతట్యాంకర్ లోకి దిగాడు. అతని కోసం వెళ్లిన ఇద్దరు కూడా ట్యాంకర్ లోకి వెళ్లి బయటకు రాలేదు. మరో వైపు వీరి కోసం వెళ్లిన మరో నలుగురు కూడా బయటకు రాలేదు. ట్యాంకర్ లోకి వెళ్లిన వారు ఊపిరాడక మృతి చెందారు. పెద్ద పెద్ద ట్యాంకర్లు కావడంతో మృతదేహలను ట్యాంకర్ ను కట్ చేసి బయటకు తీసుకు వచ్చారు. ఇవాళ ఉదయం ఆరు గంటలకే కార్మికులు విదులకు వచ్చారు. ట్యాంక్ శుభ్రం చేసేందుకు దిగి ప్రాణాలు పోగోట్టుకున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురున్నారు.