Asianet News TeluguAsianet News Telugu

జి.రాగంపేట ఆయిల్ ఫ్యాక్టరీలో ఏడుగురు మృతి: కుటుంబ సభ్యుల ఆందోళన

కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం జి. రాగంపేట ఆయిల్ ఫ్యాక్టరీలో  ఏడుగురు కార్మికుల  మృతికి  యాజమాన్యం  నిర్లక్ష్యమే  కారణమని  మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

G. Ragampeta Oil Factory Deceased Family members  demanding   action against  management
Author
First Published Feb 9, 2023, 2:01 PM IST

కాకినాడ: జిల్లాలోని పెద్దాపురం  మండలం జి. రాగంపేట  ఆయిల్ ఫ్యాక్టరీలో  ఏడుగురు  కార్మికుల మృతికి  ఫ్యాక్టరీ  యాజమాన్యం   కారణమని  స్థానికులు  ఆరోపిస్తున్నారు.   జి. రాగంపేట  ఆయిల్ ఫ్యాక్టరీలో   ట్యాంకర్ ను శుభ్రం చేసేందుకు  వెళ్లిన కార్మికులు  ఊపిరాడక  మృతి చెందారు.  ఒకరి తర్వాత ఒకరు ట్యాంకర్ లోకి వెళ్లి మృత్యువాత పడ్డారు. ట్యాంకర్ ను శుభ్రం చేసేందుకు  వెళ్లిన కార్మికులకు కనీస  రక్షణ పరికరాలను కూడా ఇవ్వలేదని  మృతుల బంధువులు చెబుతున్నారు.  

ట్యాంకర్ ను  శుభ్రం చేసేందుకు  వెళ్లిన  కార్మికులకు  మాస్కులు, ఆక్సిజన్  సిలిండర్లు  అందిస్తే   పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు.  ఎలాంటి  రక్షణ పరికరాలు ఇవ్వకుండానే  ట్యాంకర్ ను శుభ్రం  చేయాలని  ఎలా కోరుతారని  కార్మిక కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి.  ఏడుగురు కార్మికుల  ప్రాణాలను బలిగొన్న  ఫ్యాక్టరీ  యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని  డిమాండ్  చేస్తున్నారు  ఫ్యాక్టరీ ముందు  ఆందోళనకు దిగారు.  మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు  కోటి రూపాయాల పరిహరం ఇవ్వాలని డిమాండ్  చేశారు.   ఈ ఘటనలో  మృతి చెందిన  వారిలో  ఒకే కుటుంబానికి  చెందిన ముగ్గురు కార్మికులున్నారు.   పరిహరంపై  స్పష్టత ఇవ్వాలని కార్మికులు  ఆందోళనకు దిగారు.  మృతుల కుటంబాలను ఆదుకొనేందుకు  చర్యలు తీసుకుంటామని  అధికారులు హమీ ఇచ్చారు.

also read:పెద్దాపురం జీ.రాగంపేటలో విషాదం: ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తూ ఏడుగురు కార్మికులు మృతి

ఆయిల్ ఫ్యాక్టరీ విస్తరణలో  భాగంగా  కొత్త  ఫ్యాక్టరీని నిర్మించారు.  10 రోజుల క్రితమే  కార్మికులు విధుల్లో  చేరినట్టుగా  చెబుతున్నారు.  ఇవాళ ఉదయం  విధులకు  వచ్చిన  కార్మికులు మృతి చెందడంతో  స్థానికులు  ఫ్యాక్టరీ  వద్దకు  చేరుకొని  ఆందోళనకు దిగారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios