చంద్రబాబులా రంగులు మార్చడం ఊసరవెల్లి తరం కాదు

First Published 9, Jun 2018, 2:43 PM IST
kakani govardhan reddy comments on chandrababu naidu
Highlights

చంద్రబాబులా  రంగులు మార్చడం ఊసరవెల్లి తరం కాదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన నాలుగేళ్ల పాటు అమిత్ షా రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి.. మోడీ భజన చేసిన చంద్రబాబు ఆయన కొడుకు లోకేశ్‌లు.. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారన్నారు.. రంగులు మార్చడంలో ఊసరవెల్లి కూడా చంద్రబాబును చూసి భయపడుతుందని గోవర్థన్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల పాలన అవినీతి మయమని.. కుటుంబ పాలన, ప్రజలను మోసం చేయడమే టీడీపీ లక్ష్యమన్నారు.. చంద్రబాబు ఎప్పుడో ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని.. ప్రజల డబ్బుతో రాజకీయ ప్రయోజనాలను పొందడం కోసమే నవ నిర్మాణ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రుల హక్కుల వంచన విధానాలకు ముఖ్యమంత్రి వారథి వంటి వారని కాకాని ఆరోపించారు.. ప్రత్యేక హోదా ఇప్పటి వరకు సజీవంగా ఉండటానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని.. ఆయనపై విమర్శలు చేస్తే సహించబోమని గోవర్థన్ రెడ్డి హెచ్చరించారు.

loader